ఒక్క దెబ్బకు: కలిసి వెళ్దాం.. వ్యూహంతో రేవంత్ ముందుకు, ఏం చెప్తున్నాడంటే?

కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వరుసగా ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. అందరితో ముందు ముందు మంచి సంబంధాలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వరుసగా ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. అందరితో ముందు ముందు మంచి సంబంధాలు ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నారు.

 ఇదీ రేవంత్ చెబుతున్నది

ఇదీ రేవంత్ చెబుతున్నది

రేవంత్ రెడ్డి వరుసగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. రెండు అంశాలపై ఆయన వారిని కలుస్తున్నారు. ఒకటి పార్టీలో పదవి కోసం అందరి మద్దతు కూడగట్టడం, రెండు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గద్దె దింపడమే తన లక్ష్యమని ఆయన వారికి చెబుతున్నారని తెలుస్తోంది.

 ఇదీ నా లక్ష్యం

ఇదీ నా లక్ష్యం

రేవంత్ కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, రేణుకా చౌదరి తదితరులను కలిసిన విషయం తెలిసిందే. వరుసగా ఆయన సీనియర్లను కలుస్తున్నారు. 'నా లక్ష్యం కేవలం కేసీఆర్‌ను గద్దె దించడమే. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవకుండా చేయడం కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను మనమంతా కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముందుకు సాగుదాం. అప్పుడు మనం ఆయనను పదవి నుంచి దిగేలా చేయవచ్చు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది' అని కాంగ్రెస్ నేతలకు చెబుతున్నారని తెలుస్తోంది.

రేవంత్‌కు ఎందుకు అంత కోపం?

రేవంత్‌కు ఎందుకు అంత కోపం?

తనను ఓటుకు నోటు కేసులో జైలుకు పంపించడాన్ని రేవంత్ జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. అందుకోసం తెలంగాణలో తెరాస తర్వాత బలం ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి కేసీఆర్‌ను గద్దె దించడం కోసమే ఆయన ఆ పార్టీలో చేరారని చెబుతున్నారు.

 స్వాగతిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు

స్వాగతిస్తున్న కాంగ్రెస్ సీనియర్లు

రేవంత్ తమ ఇళ్లకు వచ్చినప్పుడు కాంగ్రెస్ సీనియర్లు ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నారు. సోమవారం ఆయన పొన్నాల లక్ష్మయ్య ఇంటికి వెళ్లారు. తాను రేవంత్‌ను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు.

 రేవంత్ ఒక్క దెబ్బకు

రేవంత్ ఒక్క దెబ్బకు

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్‌కు త్వరలో మంచి పదవిని ఇవ్వనున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆయనకు మంచి పదవి దక్కనుందని అంటున్నారు. కాంగ్రెస్‌లో చేరిన రేవంత్ అందరిని కలుస్తూ వారి మద్దతు కూడగడుతూ పార్టీలో కీలకనేతగా ఎదగడంతో పాటు కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+