జూబ్లీహిల్స్ లో 30వేల మెజార్టీతో గెలవబోతున్నాం: సీఎం రేవంత్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్ లో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎస్ పీఆర్ హిల్స్ నుంచి హబీబ్ ఫాతిమానగర్ వరకు నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 30 వేల మెజారిటీతో చెబుతున్నామని తెలిపారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందని జోస్యం చెప్పారు. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ అరెస్ట్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.
"జూబ్లీహిల్స్ లో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నాం.. బీఆర్ఎస్ వాళ్లు ఏమని ఓట్లు అడుగుతున్నారు..? పీజేఆర్ చనిపోతే ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా ఆనాడు మద్దతు ఇచ్చారు.. కానీ, కేసీఆర్ మాత్రం అభ్యర్థిని నిలబెట్టి ఏకగ్రీవం కాకుండా అడ్డుకున్నారు. ఇంటి నుంచి గెంటేశారని కవిత రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు. సొంత చెల్లికే న్యాయం చేయలేని కేటీఆర్.. మీకు న్యాయం చేస్తారా..? కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ రూ. లక్షలు కొల్లగొట్టారని మోదీ, అమిత్ షా చెబుతున్నారు. మరి కేంద్రం ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. కేసీఆర్, హరీష్ ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో చెప్పాలి. ఈ నెల 11 లోగా వారిని అరెస్ట్ చేయాలి" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కు బీజేపీ లొంగకపోతే తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై సీబీఐ చేత విచారణ చేపించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ నెల 11 లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలని అన్నారు. అలా జరగకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు ఇస్తున్నట్లేనని అన్నారు. ఫార్ములా ఈ రేసు కేసులో రూ. 50 కోట్ల అవినీతి జరిగిందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ కు గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఇది లోపాయికారి ఒప్పందం కాదా అని ప్రశ్నించారు. ఇవి త్వరలో బీఆర్ఎస్ బీజేపీలో విలీనానికి సంకేతాలు అని తెలిపారు. కారు దిల్లీకి చేరగానే కమలంగా మారుతోందని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications