రిమ్స్ మెడికల్ విద్యార్థినికి లైంగిక వేధింపులు.. అధ్యాపకుడే..
ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో సందీప్ వార్ అనే ఓ మెడికల్ అధ్యాపకుడు మెడికల్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. విషయాన్ని విద్యార్థిని రిమ్స్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో.. ఆమె మానసిక స్థితి సరిగా లేదనే ప్రచారాన్ని తెరమీదకు తెచ్చి ఫిర్యాదును నీరుగార్చే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వచ్చాయి.
అంతేకాదు.. మానసిక స్థితి సరిగా లేదన్న నెపంతో బాధిత విద్యార్థినిని ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి తరలించారు రిమ్స్ వైద్యులు. అయితే అక్కడి వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితి సరిగానే ఉందని నిర్దారించడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత విద్యార్థిని. ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి రాగా.. విషయం స్పందించడానికి రిమ్స్ వైద్యులు నిరాకరిస్తున్నట్లుగా తెలుస్తోంది.













Click it and Unblock the Notifications