రియో ఒలింపిక్స్: అంగీకరించక తప్పదు.. కంటతడి పెట్టిన సానియా మీర్జా
రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా - రోహన్ బోపన్నల జోడీ తీవ్ర నిరాశకు గురి చేసింది. మ్యాచ్ కోల్పోయిన అనంతరం సానియా, రోహన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సానియా కంటతడి పెట్టింది.

నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తాయని, మళ్లీ ఆడతానో లేదోనని, తనకు మాటలు రావడం లేదని సానియా అన్నారు. ఈ ఓటమి చాలా కష్టంగా ఉందని, కానీ అంగీకరించక తప్పని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె కళ్లలో నీళ్లు కనిపించాయి.
రియో ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించలేకపోయామని, 2004లో పేస్ - భూపతిల ఏతెన్స్ ఒలింపిక్స్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. టెన్నిస్ ప్లేయర్లకు అదృష్టం కలిసి రావాలని, దీని నుంచి బయట పడేందుకు కొంచెం సమయం పడుతుందని చెప్పారు. త్వరలో జరగనున్న డబ్ల్యూటీఏ పోరుకు సిద్ధమవుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications