ట్రీట్ మెంట్ కోసం వెళితే.. ఆర్ఎంపీ ఎంతకు తెగించాడంటే!
హైదరాబాద్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ మహిళ ఆర్ఎంపీ వైద్యుడిని సంప్రదించింది. అయితే వైద్యం చేసి జబ్బు నయం చేయాల్సిన సదరు ఆర్ఎంపీ మహిళపై అఘాయిత్యం చేయబోయాడు. ఈ ఘటన మల్కాజ్ గిరి పరిధిలో చోటు చేసుకుంది.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న మాధవి అనే మహిళ.. చికిత్స నిమిత్తం మల్కాజ్ గిరి పరిధిలోని పటేల్ నగర్ లో ఉన్న షాదిక్ అనే ఆర్ఎంపీ వైద్యుడి దగ్గరకు వెళ్లింది. కాగా, తన వికృతత్వాన్ని బయటపెట్టుకుంటూ షాదిక్ మాధవిపై అత్యాచారం చేయడానికి యత్నించాడు. అయితే షాదిక్ ను తీవ్రంగా ప్రతిఘటించిన మాధవి మల్కాజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.













Click it and Unblock the Notifications