భక్తి యాత్రలో విషాదం: కర్ణాటకలో కారు–వ్యాన్ ఢీ.. నలుగురు తెలంగాణవాసుల మృతి

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా హల్లిఖేడ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, వ్యాన్ ఢీ కొన్న ఘటనలో నలుగురు తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా గణగాపూర్‌లోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లి.. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని తెలుస్తోంది. ఈ అనూహ్య దుర్ఘటనతో తీవ్ర విషాదం నెలకొంది.

ఎలా జరిగిందంటే..?

కారు వేగంగా వస్తున్న వ్యాన్‌ను ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. కారు కూడా పూర్తిగా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. మృతులు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. వీరంతా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్.. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు వాపోతున్నారు.

road-accident-at-karnataka-and-four-telangana-people-died

మృతి చెందినవారి వివరాలు..

నవీన్ (40)

రాచప్ప (45)

కాశీనాథ్ (60)

నాగరాజు (40)

హల్లిఖేడ్ పోలీసు అధికారులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరోవ్యక్తిని సమీపంలోని బీదర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారంతా కుటుంబ సభ్యులు, బంధువులే కావడంతో వారి స్వగ్రామంలో విషాదం నెలకొంది.

ఇక ఇటీవల వరుస ప్రమాదాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొట్టి, అనంతరం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 19 మంది సజీవ దహనమయ్యారు.

మంగళవారం నాడు నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద కూడా మరో ప్రమాదం సంభవించింది. కావలి నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. రహదారిపై వెళ్తున్న ఒక ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ రోడ్డుపైనే బోల్తా పడగా నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

అటు ఏపీలో కూడా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతే కాకుండా ఏలూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి, పది మందికి గాయాలు.. శ్రీ సత్యసాయి జిల్లాలో మహిళ మృతి, ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+