ఎమ్మెల్యే ధర్మారెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం
వరంగల్: పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సోమవారం రాత్రి హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై జనగామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లా ధర్మారెడ్డి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలుకాగా... ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎమ్మెల్యే ధర్మారెడ్డి తన భార్య జ్యోతి, కూతుళ్లు మానస, జాహ్నవి, మనవరాలు మూడు నెలల పాపతో కలసి ఇన్నోవాలో హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తున్నారు. వర్ధన్నపేట మండలం రాపర్తికి చెందిన అయిత కుమార్(కారు యజమాని, కారు నడుపుతన్నాడు), వెంకటలక్ష్మి... పిల్లలు హరీష్, అభిలు హైదరాబాద్‌లో ఉంటూ జాఫర్‌గఢ్‌లో ఓ వివాహానికి హాజరై హైదరాబాద్‌కు ఇండికా కారులో తిరుగు ప్రయాణమయ్యారు.

కాగా, ఈ క్రమంలో జనగామ శివారులోని ఉడుముల ఆస్పత్రి వద్ద వీరి ఇండికా వాహనం వేగంగా వచ్చి ఎమ్మెల్యే చల్లా ప్రయాణిస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భార్య జ్యోతి, పెద్ద కూతురు మానస, మానస కూతురైన మూడు నెలల పాప, డ్రైవర్ అడాల సతీష్ స్వల్ప గాయాలతో బయటపడగా.. జాహ్నవి తలకు తీవ్ర గాయమై రక్త స్రావమైంది. ఇండికా కారులో ఉన్న అయితకుమార్, వెంకటలక్ష్మి తల, చేతులకు తీవ్ర గాయూలు కాగా... నిర్మల చేయి విరిగిపోయింది.
వెంకటలక్ష్మి కొడుకులు హరీశ్, అభి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెనుక మరోకారులో వస్తున్న టిఆర్‌ఎస్ జనగామ మండల శాఖ అధ్యక్షుడు కళింగరాజు ప్రమాద ఘటనను చూసి ఎమ్మెల్యేను, ఆయన కుటుంబ సభ్యులను భువనగిరి వరకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు పంపించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications