వ్యభిచారం ముసుగులో నిలువు దోపిడీల ముఠా పట్టివేత
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో వ్యభిచారం ముసుగులో దోపిడీకి పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. మీడియాలో వచ్చిన కథనాన ప్రకారం - కొన్నేళ్ళుగా మండలంలోని చందూతండ, సుబ్లేడు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొంతమంది మహిళలు, పురుషులు గ్రూపుగా ఏర్పడి వ్యభిచారం ముసుగులో బాధితులను నిలుపు దోపిడీకీ గురిచేస్తున్నారు.
స్టేట్ హైవే రోడ్డుపై లారీలను, వాహనాలను ఆపి మహిళలు డ్రైవర్లను, వాహనదారులను పక్కన గల గుట్టల్లోకి తీసుకెళ్లి లొంగబర్చుకుంటారు. ఆ తర్వాత పురుషుల ముఠా సభ్యులు అక్కడికి ప్రవేశించి విటులను కొట్టి బెదిరించి వారి వద్ద ఉన్న నగదు, బంగారం దోచుకుంటారు. ఈ వ్యవహారం గత కొన్నేళ్ళుగా నడుస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి.

పలువురు వ్యక్తులు వ్యభిచార ముసుగులో దోపిడీకీ గురయ్యారు. ఈ క్రమంలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు మహిళలు, నలుగురు పురుషులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వీరంతా వ్యభిచారం పేరుతో దోపిడీకి పాల్పడుతన్న ముఠాగా గుర్తించినట్లు తెలిసింది. వీరంతా పెద్దతండా, డోర్నకల్, నేలకొండపల్లికి చెందినవారని సమాచారం. ఈ విషయమై పోలీసులు ముమ్మరంగా విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications