హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బైక్‌పై వెళ్తుంటే పట్టుకున్నాం, పోలీసులు భేష్: సిపి మహేందర్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కాల్పుల ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. మీడియా సమావేశంలో అందుకు సంబంధించిన వివరాలను శుక్రవారంనాడు వెల్లడించారు.

నిందితులు ఫయాజ్, అబ్దుల్ ఖాదర్, షమీమ్‌లను అరెస్టు చేశారని చెప్పారు. బైక్‌పై వెళ్తుంటే నిందితులను పట్టుకున్నామని ఆయన చెప్పారు. ఈ ఘటనలో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఆయన మెచ్చుకున్నారు నిందితుల నుంచి 2 తుపాకులు, 2 నాటు తుపాకులు, 9 తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Robbery gang details revealed by Hyderabad CP

ముగ్గురు నిందితులు కర్ణాటక దొంగల ముఠాకు చెందిన వారు అని చెప్పారు. ఓ మొబైల్ సంస్థ మేనేజర్‌ను కిడ్నాప్ చేయడానికి దొంగలు ప్లాన్ చేశారు. దొంగలను కస్టడీలోకి తీసుకున్నామని తెలిపారు. అయితే దొంగలు పాత నేరస్థులు. నగదు వసూలు చేసే ఏజెంట్ల నుంచి డబ్బు దొంగిలించాలని దొంగలు ప్రణాళిక పన్నారని ఆయన చెప్పారు.

ముగ్గురు నిందితుల్లో అబ్దుల్ మీర్జా పాత నేరస్థుడని, దాంతో పోలీసులు సులభంగా గుర్తించారని ఆయన చెప్పారు. అతనిపై హైదరాబాదులో ఆరు కేసులున్నట్లు మహేందర్ రెడ్డి చెప్పారు.

English summary
Hyderabad CP Mahender Reddy said that three accused in jubilee hils firing case have been nabbed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X