'మిస్టర్ ఇండియా'గా హైదరాబాద్ యువకుడు..!

హైదరాబాద్: 'మిస్టర్ ఇండియా' పోటీల్లో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. ముంబైలో ప్రోవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన పోటీల్లో హైదరాబాద్ వాసి రోహిత్ ఖండేల్‌వాల్ 'మిస్టర్ ఇండియా-2015' టైటిల్ గెలుచుకున్నాడు.

ముంబైలో అట్టహాసంగా జరిగిన ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి దాదాపు 10 వేల మంది యవకులు హాజరయ్యారు. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో రోహిత్ విజేతగా నిలవగా, బెంగుళూరుకు చెందిన రాహుల్ రాజశేఖరన్ తొలి రన్నరప్‌గా, ముంబైకి చెందిన ప్రతీక్ గుజ్రాల్ రెండో రన్నరప్‌గా నిలిచాడు.

 Rohit Khandelwal bags Provogue Personal Care Mr. India 2015

ఈ విజయంతో రోహిత్ ఖండేల్‌వాల్ మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతనిధ్యం వహించనున్నాడు. మిస్టర్ ఇండియాతో పాటు మిస్టర్ యాక్టివ్, ప్రోవోగ్ బెస్ట్ యాక్టర్ టైటిల్ కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు.

ప్రొవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ నటి, హీరోయిన్ కరీనా కపూర్ విజేతలకు అభినందనలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+