'షిర్డీ సాయిబాబా' రగడ, అసలు పేరు ఇదీ: ఆసక్తికర విషయం
హైదరాబాద్: గత కొద్ది రోజులుగా షిర్డీ సాయి బాబా పైన స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో సాయిబాబా అంశం మరోసారి రగడకు దారి తీసింది. దీని పైన నిలయం నిర్వాహకులు అనంత బొట్ల సుధాకర్ ఆదివారం నాడు స్పందించారు.

షిర్డీ సాయి బాబాకు మతాన్ని ఆపాదించడం సరికాదని చెప్పారు. సాయినాథుడు కులమతాలకు అతీతమైన వాడని చెప్పారు. ఇదే సమయంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై పబ్లిక్ ట్రస్ట్ యాక్ట్ 1950 ప్రకారం సాయిబాబా జన్మించిన స్థలాన్ని గుర్తించారని తెలిపారు.
ఆయన గురించి అనేక విషయాలు వెల్లడించారని చెప్పారు. షిర్డీ సాయి బాబా అసలు పేరు హరిభావుభూసారి అని తెలిపారు. ఆయన కౌశిక గోత్రంలో జన్మించినట్లు గుర్తించారని అనంత బొట్ల సుధాకర్ పేర్కొన్నారు. కాగా షిర్డీ సాయి బాబాను కొలువవద్దని స్వరూపానంద చెబుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications