ఇళ్లు కట్టుకునేవారికి 3 లక్షలు: కేబినెట్ కీలక నిర్ణయాలను వెల్లడించిన హరీశ్ రావు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దాదాపు 5 గంటలపాటు సాగిన భేటీలో తీసుకున్న నిర్ణయాలను ఇతర మంత్రులతో కలిసి ఆర్థిక మంత్రి హరీశ్ రావు మీడియాకు వెల్లడించారు.

ఇళ్లు కట్టుకునే పేదలకు రూ. 3 లక్షలు

ఇళ్లు కట్టుకునే పేదలకు రూ. 3 లక్షలు

రాష్ట్రంలో సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం గృహలక్ష్మి పథకం కింద రూ. 3 లక్షలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించినట్లు హరీశ్ రావు తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 4 లక్షల మందికి ఇంటి నిర్మాణానికి మూడు విడతల్లో ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి 3వేల ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని వివరించారు. గృహలక్ష్మి పథకం నిబంధనలను కూడా సరళంగా నిర్ణయించామని, గృహ నిర్మాణ సంస్థ ద్వారా గతంలో నిర్మించుకున్న ఇళ్ల అప్పులను రద్దు చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు.

డబుల్ బెడ్రూం ఇళ్లు కొనసాగుతాయి, ఆ ఇళ్ల క్రమబద్ధీకరణ

డబుల్ బెడ్రూం ఇళ్లు కొనసాగుతాయి, ఆ ఇళ్ల క్రమబద్ధీకరణ

స్థలాలు లేనివారికి డబుల్ బెడ్రూం ఇళ్ల కార్యక్రమం కొనసాగుతుందని హరీశ్ రావు తెలిపారు. ప్రభుత్వ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. జీవో 58, 59 దరఖాస్తులను పరిష్కరించి ఇంటిపై హక్కులు కల్పిస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే పోడు భూముల సమస్యను క ూడా పరిష్కరించాలని నిర్ణయించామన్నారు. పోడు భూముల పంపిణీని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాుల ఇస్తామని, దీంతో 1.55 లక్షల మంది లబ్ధి పొదుతారని తెలిపారు.

1.30 లక్షల ఫ్యామీలకు దళితబంధు: ఆరోజే అంబేద్కర్ విగ్రహావిష్కరణ

1.30 లక్షల ఫ్యామీలకు దళితబంధు: ఆరోజే అంబేద్కర్ విగ్రహావిష్కరణ

రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వనున్నట్లు తెలిపారు. తెలంగాణ తీసుకొచ్చిన ఈ పథకంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. మరోవైపు, అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు హరీశ్ రావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద పండగగా నిర్వహిస్తామన్నారు. సచివాలయం, అమరుల స్మారకం పనులు తుది దశలో ఉన్నాయన్నారు. జూన్ 2లోపు వాటిని ప్రారంభిస్తామన్నారు. ఇక రెండో విడత గొర్రెల పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు.. ఇందుకోసం రూ. 4,463 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

తెలంగాణ భక్తుల కోసం శబరిమల, కాశీలో వసతి భవనాలు

తెలంగాణ భక్తుల కోసం శబరిమల, కాశీలో వసతి భవనాలు

తెలంగాణ రాష్ట్రం నుంచి కాశీ, శబరిమల యాత్రలకు ప్రజలు భారీగా వెళ్తున్నారని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే కాశీ, శబరిలల్లో రాష్ట్ర భక్తుల కోసం భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్లు హరీశ్ రావు చెప్పారు. కాశీలో వసతి గృహ సముదాయం కోసం రూ. 25 కోట్లు, శబరిమలలో వసతి గృహం కోసం రూ. 25 కోట్లు కేటాయించినట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. మరోవైపు, తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న 10 బిల్లుల ఆమోదం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఈ భేటీలో నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+