రూ.7 కోట్ల పాతనోట్ల వ్యవహారం: ‘‘జీవిత తమ్ముడు కాదు, కానీ ఇండస్ట్రీలో చాలామందితో లింకులు’’
రూ.7 కోట్ల పాత నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాసరావు సినీనటి జీవిత సోదరుడు కాడని టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. అయితే ఫిల్మ్ ఇండ్రస్టీలో అతడికి చాలామందితో లింకులు ఉన్నట్లు ఆయ
హైదరాబాద్ : రూ.7 కోట్ల పాత నోట్ల మార్పిడి కేసులో అరెస్ట్ అయిన శ్రీనివాసరావు సినీనటి జీవిత సోదరుడు కాడని టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి తెలిపారు. అయితే ఫిల్మ్ ఇండ్రస్టీలో అతడికి చాలామందితో లింకులు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
డీసీపీ లింబారెడ్డి శుక్రవారం విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ.. శ్రీనివాసరావు చెన్నైలోని జాయ్ స్టోర్ట్‌లో ప్రొడక్షన్ మేనేజర్‌గా పని చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పురుషోత్తం, శ్రీనివాసరావు అనే ఇద్దరిని అరెస్ట్ చేసి, రూ.7 కోట్ల పాతనోట్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు.

బ్యాంకర్లు తమకు బాగా తెలుసునని చెబుతూ.. చాలామంది వ్యక్తుల దగ్గర రద్దు అయిన నోట్లు తీసుకుని మార్పిడి చేసేందుకు నిందితులు యత్నించినట్లు డీసీపీ లింబారెడ్డి తెలిపారు.
చెన్నైకి చెందిన కోటేశ్వర్ అనే వ్యక్తి వద్ద రూ.7 కోట్లను 20 శాతం కమిషన్ మీద మార్పిడి చేస్తామని వారం రోజల క్రితం తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు డీసీపీ తెలిపారు.
ఈ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన శ్రీనివాసరావు నటి జీవిత తమ్ముడనే వదంతులు తొలుత వినిపించాయి. దీనిపై జీవిత వివరణ ఇచ్చారు. తాజాగా డీసీపీ లింబారెడ్డి కూడా శ్రీనివాసరావు జీవిత తమ్ముడు కాదని పేర్కొన్నారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications