రూ.7కోట్ల పాత నోట్లు లభ్యం: ఎక్కడ్నుంచి తెచ్చారు? టీవీ నటికి సంబంధం!
పెద్ద నోట్లు రద్దు అనంతరం నగరంలో మరోసారి పాత నోట్లు(రూ. 500, 1000) భారీగా బయటపడ్డాయి.
హైదరాబాద్: పెద్ద నోట్లు రద్దు అనంతరం నగరంలో మరోసారి పాత నోట్లు(రూ. 500, 1000) భారీగా బయటపడ్డాయి. జూబ్లీహిల్స్‌లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన రూ. 500, రూ. 1000 నోట్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో మొత్తం రూ. 7కోట్ల విలువైన కరెన్సీ నోట్లను గుర్తించారు.
శ్రీనివాస్ ఎంటర్‌ప్రైజెస్ కార్యాలయంలో పెద్ద మొత్తంలో రద్దైన పాత నోట్లు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి రవి, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఈ నోట్లపై విచారిస్తున్నారు.

కాగా, వారిలో ఒకరు ఓ టీవీ నటికి సమీప బంధువని సమాచారం. వీరిద్దరూ ఈ నోట్లు ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎందుకు ఈ కార్యాలయంలో ఉంచారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications