కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్: సీఎం రేవంత్‌కు కౌంటర్

గజ్వేల్: తెలంగాణ బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎర్రవల్లిలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. ఈ సంద‌ర్భంగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌కు కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ రాష్ట్ర నాయ‌కులు, జిల్లా నాయ‌కులు, మ‌ద్ద‌తుదారులు, అభిమానులు భారీ సంఖ్య‌లో బీఆర్ఎస్‌లో చేరారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, బాల్క సుమ‌న్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసమే తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. ఇటీవల బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ కుమార్ ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే, పొత్తును విరమించుకోవాల్సి రావడంతో మనస్తాపానికి గురైన ఆర్ఎస్పీ.. ఆ పార్టీకి రాజీనామా చేసి తాజాగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

RS Praveen kumar joins brs party on the presence of KCR

బీఆర్ఎస్ పార్టీలో చేరే ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీల కోసం కాదు.. ప్ర‌జా సేవ కోస‌మే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ ఉద్య‌మ నేత‌, బీఆర్ఎస్ పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు కేసీఆర్ నాయ‌క‌త్వంలో ప‌ని చేసే అవ‌కాశం రావ‌డం చాలా ఆనందంగా ఉంది. తనను అక్కున చేర్చుకుని ఇంత దూరం న‌డిపించిన తెలంగాణ ప్రజానీకానికి పాదాభివంద‌నాలు తెలిపారు ప్రవీణ్ కుమార్.

తెలంగాణ వాదం, బ‌హుజ‌న వాదం రెండూ ఒక్క‌టే. ప్రాణ‌హిత‌, గోదావ‌రి న‌దులు క‌లిసిన‌ట్లు, కృష్ణా, తుంగ‌భ‌ద్ర న‌దులు ఏ విధంగా క‌లుస్తాయో.. ఆ మాదిరిగానే తెలంగాణ వాదం, బహుజ‌న వాదం ఒక్క‌టే. త‌ర‌త‌రాలుగా అణిచివేత‌కు గురైన తెలంగాణ‌కు కేసీఆర్ విముక్తి క‌ల్పించారు. బ‌హుజ‌నులు కూడా అణిచివేత‌కు గుర‌య్యారు. వారికి విముక్తి క‌ల్పించి వారిని వెలుగు వైపు న‌డిపించింది బ‌హుజ‌న వాదం అని ఆర్ఎస్పీ చెప్పుకొచ్చారు.

కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ‌ గ‌త ప‌దేళ్లలో స్వ‌ర్ణ‌యుగాన్ని చూసిందన్నారు ప్రవీణ్ కుమార్. తెలంగాణ అభివృద్ధి కోసం గొప్ప‌ పునాది వేయ‌బ‌డింది. కేసీఆర్ అధికారంలో లేరు కానీ ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్నారు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్‌ను వీడి వెళ్లిపోతున్నారు. కానీ, మీరు బ‌లగంగా వ‌చ్చార‌ని బీఆర్ఎస్ సీనియ‌ర్లు అన్నారు. బ‌హుజ‌న వాదులంతా కేసీఆర్ వెంట న‌డ‌వాల‌ని నిర్ణ‌యించుకున్నారని తెలిపారు.

తెలంగాణ పున‌ర్ నిర్మాణంలో భాగ‌స్వాములు కావాల‌ని నిర్ణ‌యించుకుని వ‌చ్చామన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మరోవైపు, తనపై చేసిన వ్యాఖ్యలకు సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఆర్ఎస్పీ కౌంటర్ ఇచ్చారు. ప్రత్యేక పరిస్థితుల్లోనే గులాబీ పార్టీలోకి మారాల్సి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అక్కసుతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ తీసుకునే వాడినైతే అధికార పార్టీలోనే చేరేవాడినని అన్నారు. గేట్లు తెరిస్తే వచ్చే గొర్రెల మందలో ప్రవీణ్ కుమార్ ఉండరని రేవంత్‌కు ఘాటుగా బదులిచ్చారు. కాగా, ప్రవీణ్ కుమార్‌కు కాంగ్రెస్ పార్టీలో అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదని రేవంత్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+