ఆ రెండు పరీక్షల్లో లోపాలు.. అక్రమాలు జరిగి ఉంటాయి..? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
తెలంగాణ ప్రభుత్వం కొలువుల భర్తీపై ఫోకస్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలను క్రమంగా భర్తీ చేస్తోంది. ఎన్నికల వచ్చేవరకు పూర్తి చేసే పనిలో ఉంది. అయితే విపక్షాల నుంచి అంతేస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. వివిధ నియామకాల గురించి కామెంట్స్ చేస్తున్నాయి. విద్యుత్ శాఖ నియామకాల గురించి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు.
తెలంగాణ విద్యుత్ శాఖ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆయన ఫైరయ్యారు. తెలంగాణ సదరన్ పవర్ కంపెనీ ఆధ్వర్యంలో జరిగిన జూనియర్ లైన్ మెన్ రాతపరీక్షకు వేలాది మంది తెలంగాణ నిరుద్యోగులు హాజరయ్యారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ పరీక్షలో భారీగా అవకతవకలు జరిగాయని వెల్లడైందని, ఇప్పటికే దీనిపై రాచకొండ పోలీసులు ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. దీనికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను రాచకొండ పోలీసులకు అందజేశానని తెలిపారు.

ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల పరీక్షలో అక్రమాలు జరిగాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఒకే అభ్యర్థికి నాలుగు హాల్ టికెట్లు జారీ చేశారని తెలిపారు. ఒకటే ఫొటో, ఒకటే పుట్టిన తేదీ, ఒకటే తండ్రి పేరు ఉంటుందని, కానీ సర్ నేమ్ మాత్రం మారుతూ ఉంటుందని వివరించారు. పరీక్షకు రెండ్రోజుల ముందే సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సీఎండీ రఘుమారెడ్డి దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. పరీక్షను యథేచ్ఛగా జరిపారని ఆరోపించారు.
రెండు పరీక్షల్లో అక్రమాలు జరిగాయనే అనుమానాలు కలుగుతున్నాయని చెబుతున్నారు. జూనియర్ లైన్ మెన్, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాల పరీక్షలను రద్దు చేసి వేలాదిమంది నిరుద్యోగుల భవిష్యత్ కాపాడాలని విజ్ఞప్తి చేశారు. తాజాగా పరీక్షలు జరపాలని, అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యుత్ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకుంటే ట్రాన్స్ కో కార్యాలయాల ముందు ధర్నాలు చేపడతామని హెచ్చరించారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications