ఆర్టీసీ బస్సుపై దాడి, కండక్టర్‌పై పాము విసిరేసిన మహిళ

హైదరాబాద్: నగరంలోని విద్యానగర్ బస్ స్టాప్ సమీపంలో ఓ మహిళ వీరంగం సృష్టించింది. ఆర్టీసీ బస్సుపై దాడి చేయడంతోపాటు నిలదీసిన మహిళా కండక్టర్‌పై పామును విసిరేసింది. దీంతో ఒక్కసారిగా కండక్టర్ తోపాటు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. బస్సు ఆపకపోవడంతోనే ఆమె ఇలా చేసినట్లు తెలుస్తోంది.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దిల్‌సుఖ్‌నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గురువారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తోంది. విద్యానగర్ బస్ స్టాప్ సమీపంలోని సిగ్నల్ వద్ద ఫ్రీ లెఫ్ట్ తిరుగుతుండగ.. ఓ మహిళ బీర్ బాటిల్‌తో బస్సుపై దాడి చేసింది. దీంతో బస్సు వెనక భాగంలోని అద్దం పూర్తిగా ధ్వంసమైంది.

RTC bus attacked woman throws snake at conductor

విషయం గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపారు. ఆ బస్సులో విధులు నిర్వహిస్తున్న మహిళా కండక్టర్ కిందకి దిగి.. నిందితురాలిని పట్టుకుని.. ఎందుకు దాడి చేశావంటూ నిలదీశారు. దీంతో ఆ మహిళ.. ఒక్కసారిగా తన సంచిలో ఉన్న పామును తీసి కండక్టర్‌పై విసిరేసింది. ఆమె చేతులు అడ్డుపెట్టుకోవడంతో పాము కిందపడింది.

ఈ ఘటనపై ఆర్టీసీ అధికారులు నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే, బస్సు ఆపకపోవడం వల్లే దాడి జరిగిందన్న వాదనలను ఆర్టీసీ అధికారులు కొట్టిపారేశారు. నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+