కేసీఆర్‌ని టార్గెట్ చేసిన కోదండ, క్లీన్&గ్రీన్(పిక్చర్స్)
హైదరాబాద్: 43 శాతం ఫిట్మెంట్ కోరుతూ సమ్మె చేస్తున్న ఆర్టీసీ సిబ్బంది ఆదివారం నాడు జూబ్లీ బస్ స్టేషన్ వద్ద స్వచ్ఛ భారత్ నిర్వహించారు. జేబీఎస్ పరిసరాలను శుభ్రం చేసి తమదైన శైలిలో నిరసన తెలిపారు.
ఆర్టీసీ సమ్మె ఆదివారానికి ఐదు, సోమవారానికి ఆరో రోజుకు చేరుకుంది. పలు జిల్లాల్లో బస్సులను డిపోల నుండి వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు.
ర్యాలీలు, మానవహారాలు, ఆర్టీసీ ఐక్యకార్యాచరణ ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. నిరసన తెలుపతూ డిపోల వద్ద పరిసరాలను శుభ్రం చేశారు.

ఆర్టీసీ సమ్మె
నిజామాబాదులో అద్దె బస్సు బోధన్‌కు వచ్చింది. దీంతో కొందరు కార్మికులు ముసుగులు ధరించి బస్సు అద్దాలు పగులగొట్టారు. ఈ ఘటనలో ఓ కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్టాండులో వంటావార్పు నిర్వహించారు. కొన్నిచోట్ల అద్దె బస్సులు పాక్షికంగా నడిచాయి.

ఆర్టీసీ సమ్మె
పోలీసుల రక్షణ మధ్య తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపించారు. పలుచోట్ల ఆర్టీకీ కార్మికులు ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఆందోళనలు విపక్షాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని మద్దతు తెలిపారు. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరాం సమ్మెకు మద్దతు పలికారు.

ఆర్టీసీ సమ్మె
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆర్టీసీ కార్మికులకు వేతన సవరణ జరగాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్మెంట్ చెల్లించాలన్న ఆర్టీసీ కార్మికుల డిమాండును ఆయన సమర్థఇంచారు.

ఆర్టీసీ సమ్మె
శనివారం జేబీఎస్ వద్ద సమ్మెలో పాల్గొన్న కోదండరామ్... ఆదివారం తాండూరు డిపో వద్ద సంఘీభావం తెలిపారు. ఫిట్మెంట్ పెంచాలని తాము ఏప్రిల్ నెలలోనే నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు.

ఆర్టీసీ సమ్మె
కార్మికులు అంటే లెక్కలేనట్లు ప్రవర్తించడం ఏమాత్రం సరికాదన్నారు. అయిదు రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడం, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దారుణమన్నారు.

ఆర్టీసీ సమ్మె
తక్కువ జీతాలతోనే ఆర్టీసీని బతికించుకోవడానికి కార్మికులు పని చేశారన్నారు. సంస్థ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ కార్మికులు, ఇతర ఉద్యోగుల మధ్య వ్యత్యాసాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.

ఆర్టీసీ సమ్మె
తెలంగాణ ఉద్యమం సమయంలో కార్మికులు ఎంతగా పని చేశారో గుర్తించాలన్నారు. సకల జనుల సమ్మె కాలంలో వారి మద్దతును గుర్తించాలన్నారు.

ఆర్టీసీ సమ్మె
కాగా, సకల జనుల సమ్మె సమయంలో, తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ ఉద్యోగుల పాత్రను మరువరాదని మరికొందరు అన్నారు.












Click it and Unblock the Notifications