హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌ చేరిన రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి... మరికొద్దిరోజుల్లో క్లినికల్ ట్రయల్స్...

|
Google Oneindia TeluguNews

రష్యా అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్ వి' హైదరాబాద్ చేరింది. రష్యాతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు హైదరాబాద్‌లోని డా.రెడ్డీస్ సంస్థ ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి రెండో దశ,మూడో దశ ప్రయోగాలు చేపట్టనుంది. ఈ నెల 15 నుంచి క్లినికల్ ట్రయల్స్‌ను ప్రారంభించనున్న రెడ్డీస్... సుమారు 2వేల మందిపై ప్రయోగాలు జరపనుంది. స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కంటైనర్లు హైదరాబాద్ చేరిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Recommended Video

ussia's Sputnik V COVID 19 Vaccine Reached Hyderabad For Clinical Trails By Dr Reddy’s Lab

ప్రపంచంలోనే తొలిసారిగా రష్యా స్పుత్నిక్ వి కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసిన సంగతి తెలిసిందే. స్పుత్నిక్ వి క్లినికల్ ట్రయల్స్, భారీ మొత్ంలో వ్యాక్సిన్ తయారీ కోసం భారత్‌ను భాగస్వామిగా చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు రష్యా మొదట్లోనే చెప్పింది. అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత్‌కు చెందిన డా.రెడ్డీస్ సంస్థతో ఆర్‌డీఐఎఫ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో డ్రగ్ రెగ్యులేటరీ సంస్థల అనుమతలు పొందిన తర్వాత 10 కోట్ల డోసుల వ్యాక్సిన్‌ను ఆర్‌డీఐఎఫ్‌ డా.రెడ్డీస్‌కు సరఫరా చేయనుంది.

russias sputnik v vaccine arrives india for clinical trials in dr.reddys

ప్రస్తుతం చివరి దశ ప్రయోగాల్లో ఉన్న స్పుత్నిక్ వి వ్యాక్సిన్ కోవిడ్ 19 నుంచి రక్షణ కల్పించడంలో 92శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు రష్యా బుధవారం(నవంబర్ 11) ప్రకటించింది. తాము అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ 90శాతం సమర్థవంతంగా పనిచేస్తోందంటూ అమెరికాకు చెందిన ఫైజర్ ఫార్మా ప్రకటన చేసిన మరుసటిరోజే రష్యా నుంచి కూడా ప్రకటన రావడం గమనార్హం. రష్యాలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ప్రస్తుతం మాస్కోలోని 29 క్లినిక్స్‌లో మూడో దశ ప్రయోగాల్లో ఉంది. మూడో దశలో మొత్తం 40వేల వలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగాలు జరుపుతున్నారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన తొలి మధ్యంతర డేటా ఆధారంగా వ్యాక్సిన్ సామర్థ్యం 92శాతం ఉందని చెప్పారు.

English summary
The Russian Sputnik V vaccine haS arrived in India following the nod to Hyderabad-based pharmaceutical company, Dr. Reddy's Laboratories to conduct an adaptive phase 2/3 human clinical trial for the vaccine in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X