సాహో పై సోషల్ మీడియాలో సెటైర్లు..! పబ్జీ గేమ్ కాపీ కొట్టి సినిమా తీసేశారా ..?

Recommended Video

    Saaho Movie Is Copy Of Pub-G Game, Fans Reacting In Social Media..?? || Oneindia Telugu

    హైదరాబాద్ : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో.. ఇటీవలే విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకొంది. బాహుబలి సీరిస్ తర్వాత ప్రభాస్ నెక్ట్స్ సినిమాపై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా జనానికి అంతలా నచ్చినట్టు లేదు. ఒక్కొక్కరు ఒకలా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ మాత్రం హిట్ టాక్ తెచ్చుకోలేదు. ఈ క్రమంలో పబ్జీ గేమ్‌తో మూవీని పొలుస్తున్నారు. ఆ ఆటలోని టాస్క్ ఆదర్శంగా తీసుకున్నారా ఏంటీ అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. ఒక్కొక్కరు మూవీ గురించి కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

    పబ్లీ గేమ్ ...

    పబ్లీ గేమ్ ...

    అంతేకాదు పబ్జీ గేమ్‌ను .. సాహో మూవీలో ప్రభాస్ చేసే స్టంట్‌ను పక్క పక్కనే పెట్టి పోస్ట్ చేశారు. ఆ ఆటలో టాస్క్ చేసే అతను ఎలా ఎగిరిపోతాడు ప్రభాస్ కూడా అలానే కనిపించాడు. మధ్యలో టాస్క్‌లో భాగంగా ఎయిర్ బెలూన్ ఓపెన్ చేస్తారు. ప్రభాస్ చేసే స్టంట్‌ కూడా సేమ్ అలానే కనిపించింది. తర్వాత మెల్లగా ప్రభాస్ నేలపై దూకుతాడు. ఆటలో కూడా టాస్క్ వ్యక్తి అలానే దూకేయడంతో సాహో మూవీ కోసం పబ్జీ గేమ్‌ను ఆదర్శంగా తీసుకున్నారా అనే సందేహం కలుగుతుంది.

    కమర్షియల్ మూవీ అని చెప్పి ..

    కమర్షియల్ మూవీ అని చెప్పి ..

    ఫక్తు కమర్షియల్ మూవీ అని రూ.300 కోట్లు పెట్టి తీసింది .. ఇదా అని కామెంట్లు పెడుతున్నారు. తాము ఎంతో ఎక్స్ పెక్ట్ చేశామని .. కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదని మరికొందరు అంటున్నారు. పబ్జీ గేమ్‌ను కాపీ కొట్టి సినిమా తీశారా అంటూ సోషల్ మీడియాలో సెట్లైర్ల వర్షం కురుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ తరహాలో అని చెప్పి .. తీసింది ఇదా అని గగ్గోలు పెడుతున్నారు. ఓ ఆటను ఆదర్శంగా తీసుకున్నట్టు అనిపిస్తోంది. అని కామెంట్లు పెడుతున్నారు.

    వీడియో ట్రోల్

    వీడియో ట్రోల్

    సాహో మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో ఆధారంగా జోకులు లేస్తున్నారు నెటిజన్లు. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో ఉంటుందని చెప్పి .. పబ్జీని ఆదర్శంగా తీసుకున్నారా అని కొశ్చన్ చేస్తున్నారు. గేమ్ ఆట మాదిరిగా సినిమాలో చూపించారని కౌంటర్ ఇచ్చారు. ఇందుకోసమే రూ.300 కోట్ల వ్యయం అయ్యిందా అని సందేహం వ్యక్తం చేశారు. మరికొందరేమో ... రాజమౌళి తర్వాత మూవీ ఎలాగూ ఫట్టు అని గుర్తుచేస్తున్నారు. ఇదివరకు అందరూ హీరోల సినిమాలు ప్లాపయ్యాయని .. సాహో కూడా అలాగే జరిగింది అని అంటున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+