హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శబరిమల ఆన్‌లైన్ పాసుల గోల్‌మాల్: హైదరాబాద్ కేంద్రంగా కొత్త ధందా: 12 గంటల్లో 44 వేల టికెట్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమల ఆన్‌లైన్ పాస్‌ల కొనుగోలు వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు విజృంభించారు. తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. భక్తుల నుంచి భారీ మొత్తంలో నగదును కొల్లగొట్టారు. వారికి నకిలీ పాస్‌లను అంటగట్టారు. ఈ వ్యవహారం మొత్తం హైదరాబాద్ కేంద్రంగా సాగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై సైబర్ క్రైమ్ కింద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడాన్ని నివారించడానికి శబరిమలలో వర్చువల్ క్యూ విధానాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి వెళ్లదలిచిన భక్తులందరూ ఈ విధానం కింద టికెట్లు, పాస్‌లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది. మాలధారణ చేసిన మణికంఠుడి భక్తులు ఏపీ, తెలంగాణ, తమిళనాడు నుంచి లక్షలాది మంది అయ్యప్పస్వామి భక్తులు శబరిమలకు తరలి వెళ్తుంటారు.

వర్చువల్ విధానంలో శబరిమల ఆలయం అధికారులు టికెట్ల బుకింగ్‌ను పదిరోజుల కిందటే చేపట్టారు. మండలం-మకరవిళ్లక్కు సీజన్ కోసం 12 గంటల వ్యవధిలో 44 వేల పాసులను జారీ చేశారు. బుకింగ్‌ను నిలిపివేశారు కూడా. ఈ విషయం తెలియని భక్తులు.. స్వామివారిని దర్శించుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు. సైబర్ నేరగాళ్లు సృష్టించిన నకిలీ వెబ్‌సైట్ల బారిన పడ్డారు.

Sabarimala: Virtual queue racket rampant in Tamil Nadu and Telangana

హైదరాబాద్‌కు చెందిన కొందరు భక్తులు 1250 రూపాయలను చెల్లించి వర్చువల్ క్యూ పాస్‌లను బుక్ చేసుకున్నారు. ఆ మొత్తం సరిపోదని, భక్తుల సంఖ్య భారీగా ఉన్నందున మరింత అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందంటూ సైబర్ నేరగాళ్లు ఆ భక్తులకు ఫోన్ చేశారు. మరో 2,750 రూపాయలను చెల్లించాలని డిమాండ్ చేశారు. తమిళనాడు, కర్ణాటకల్లోనూ ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చినట్లు తేలింది.

నకిలీ వెబ్‌సైట్ల ద్వారా వర్చువల్ విధానంలో టికెట్లను బుక్ చేసుకున్న కొందరు భక్తులు స్వామివారి దర్శనానికి శబరిమల వరకూ వెళ్లి.. వెనక్కి రావాల్సి వచ్చింది. నీలక్కల్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారు చూపించిన పాసులు చెల్లవని, అవి నకిలీవని తేల్చారు. దీనితో వారంతా స్వామివారిని దర్శించుకుండానే వెనక్కి రావాల్సి వచ్చింది. ఇలాంటి ఫిర్యాదులు వందల సంఖ్యలో అందినట్లు శబరిమల సన్నిధానంలోని అఖిల భారత అయ్పప్ప సేవా సంఘం క్యాంప్ ఆఫీస్ సైతం వెల్లడించింది.

English summary
A racket operating across Telangana, Karnataka and Tamil Nadu has been fleecing pilgrims by providing fake virtual queue passes for Sabarimala darshan. The operators have been offering fake passes via mobile phones after levying up to Rs 5,000 per pilgrim in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X