Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sachin Tendulkar birthday: హ్యాపీ హాఫ్ సెంచరీ: కేటీఆర్ వెరైటీ విషెస్

హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ పుట్టినరోజివ్వాళ. ఇవ్వాళ ఆయన 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టారు. దీన్ని స్పెషల్‌గా తీసుకున్నారు అభిమానులు. కుప్పలు తెప్పలుగా విషెస్ తెలియజేస్తోన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ బర్త్‌డే గ్రీటింగ్స్‌తో నిండిపోతోన్నాయి. #SachinTendulkar, #SachinTendulkarbirthday, అనే హ్యాష్ ట్యాగ్స్‌పై వేలాది ట్వీట్స్ పోస్ట్ అవుతున్నాయి.

1973 ఏప్రిల్ 24వ తేదీన ముంబైలో జన్మించారాయన. 1989 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌తో టెండుల్కర్ అరంగేట్రం చేశారు. అదే ఏడాది పాకిస్తాన్‌పైనే తన తొలి వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. సుదీర్ఘకాలంపాటు క్రికెట్ ప్రపంచాన్ని శాసించారు. మరే ఇతర బ్యాటర్‌ కలలో కూడా ఊహించని రికార్డులను నెలకొల్పారు.

 Happy Half Century, Minister KTR greets

టెస్టుల్లో 51, వన్డేల్లో 49 సెంచరీలు బాదాడు. సెంచరీల్లో సెంచరీ సాధించిన ఏకైక మొనగాడు సచిన్. టెండుల్కర్ హయాంలో- అన్ని ఫార్మట్ల క్రికెట్‌లో అప్పటివరకు ఉన్న రికార్డులను చెరిగిపోయాయి. ఎవరూ ఛేదించలేని రికార్డులను తన పేరు మీద లిఖించుకున్నాడీ మాస్టర్ బ్లాస్టర్. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో టోర్నమెంట్‌లో ముంబై ఇండియన్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తోన్నాడు.

ఎందరో యంగ్ క్రికెటర్లకు రోల్ మోడల్‌గా నిలిచాడు సచిన్. భారతరత్న పురస్కారాన్ని అందుకున్న ఏకైక స్పోర్ట్స్ పర్సన్ టెండుల్కరే. ఇప్పటివరకు సచిన్‌కు మినహా మరెవరికీ ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించలేదు. రాజ్యసభకూ నామినేట్ అయ్యారు. సచిన్ టెండుల్కర్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయనకు పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలియజేస్తోన్నారు.

భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆయనకు బర్త్‌డే విషెస్ తెలిపారు. హ్యాపీ హాఫ్ సెంచరీ అంటూ వెరైటీగా గ్రీట్ చేశారు. 50వ సంవత్సరంలోకి అడుగు పెట్టినందున ఈ రకంగానూ సచిన్‌.. హాఫ్ సెంచరీని పూర్తి చేసినట్టయిందనే అర్థం వచ్చేలా కేటీఆర్ ఆయను గ్రీటింగ్స్ తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు. సచిన్, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో కలిసి దిగిన ఓ ఫొటోను ఈ ట్వీట్‌కు జత చేశారు కేటీఆర్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+