హైద్రాబాద్‌లో నడిరోడ్డుపై యువకుడికి సచిన్ క్లాస్, ప్రామిస్ చేయమని.. (వీడియో)

భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తాను హైదరాబాద్‌లో రోడ్డుపై కారులో వెళుతున్న‌ప్పుడు ప‌లువురు యువ‌కుల‌కు చేసిన సూచ‌న‌ల గురించి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో షేర్ చేశాడు.

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ తాను హైదరాబాద్‌లో రోడ్డుపై కారులో వెళుతున్న‌ప్పుడు ప‌లువురు యువ‌కుల‌కు చేసిన సూచ‌న‌ల గురించి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో షేర్ చేశాడు.

ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఆయ‌న త‌న ట్విట్ట‌ర్ అకౌంటులో పోస్ట్ చేశాడు. రోడ్డుపై కారులో ఉన్న స‌చిన్‌ను గ‌మ‌నించిన కొంద‌రు ఆయ‌నతో సెల్ఫీ దిగడానికి ప్ర‌య‌త్నించారు. ఆ సమయంలో హెల్మెట్ ధరించాలని వారికి సూచించాడు. ఈ వీడియోను అతను పోస్ట్ చేశాడు.

ఏప్రిల్ 5న ఉప్పల్ స్టేడియంలో జరిగిన సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు సచిన్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా హైదరాబాద్ నగర రోడ్లపై సచిన్ ప్రయాణిస్తుండగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆయన కారు ఆగింది.

ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులు తమ పక్కనే కారులో సచిన్‌ను చూసి సెల్ఫీ తీసుకోవడానికి ఎగబడ్డారు. వాళ్ల కోసం కారు విండో తెరిచి... సెల్ఫీ తీసుకునే అవకాశమిచ్చాడు.

ఆ తర్వాత ఓ యువకుడిని ఉద్దేశించి 'అచ్చా.. ఏక్ ప్రామిస్ కరో.. నెక్ట్స్ టైమ్ హెల్మెట్ దాలోకి ఓకే. ఇట్స్ డేంజరస్ ఫర్ యూ' అన్నారు. సచిన్ అలా అనడంతో 'యస్ సర్. థ్యాంక్యూ సోమచ్' అని ఆ యువకుడు చెప్పాడు.

మరో వ్యక్తి ద్విచక్రవాహనం పై నుంచే సచిన్‌కు నమస్కరించాడు. అతడిని ఉద్దేశించి 'హెల్మెట్ దాలో భాయ్' అంటూ ప్రతి నమస్కారం చేశారు. సచిన్‌తో పాటు కారులో కూర్చున్న మరో వ్యక్తి ఈ సన్నివేశాన్ని వీడియో తీశారు. ఆ వీడియోని సచిన్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, రోడ్ సేఫ్టీ గురించి ట్వీట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+