అవి చూశాక ఎంతో బాధనిపిస్తోంది.. సీపీ సజ్జనార్ ఎమోషనల్ పోస్ట్.

అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్‌ఫోన్.. నేడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగాక, అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు యువతులను ఊహించని ప్రమాదాల్లోకి నెట్టేస్తున్నాయని, ఇటీవల తన దృష్టికి వచ్చిన కొన్ని కథనాలు చూశాక మనసు కలిచివేసిందని ఆయన భావోద్వేగంతో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన యువతకు, తల్లిదండ్రులకు పలు కీలక సూచనలు చేశారు.

సైబర్ నేరగాళ్లు సినీ నటుల లేదా అందమైన యువకుల ఫోటోలను నకిలీ ఖాతాలకు డీపీలుగా పెట్టుకుని అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపుతున్నారని సజ్జనార్ వివరించారు. "వారి మాయమాటలను గుడ్డిగా నమ్మి కొందరు ఆడపిల్లలు తమ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంచుకుంటున్నారు. కానీ, ఆ క్షణం నుంచే ఆ అపరిచితులు రాక్షసుల్లా మారిపోతున్నారు.

మార్ఫింగ్ చేసిన ఫోటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతూ.. డబ్బులు కావాలని, భౌతికంగా కలవాలని వేధిస్తున్నారు. పరువు పోతుందన్న భయంతో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేక, తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తూ కొందరు ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భయం వద్దు.. పోలీసుల అండ ఉంది!: VC Sajjanar

వేధింపులు ఎదుర్కొంటున్న ఆడపిల్లలకు సజ్జనార్ ఒక సోదరుడిలా, ఒక తండ్రిలా భరోసానిచ్చారు. "ఆన్‌లైన్‌లో సమస్య ఎదురైతే అస్సలు భయపడకండి. సైబర్ నేరగాళ్ల బ్లాక్‌మెయిలింగ్‌కు లొంగిపోయి ప్రాణాలు తీసుకోవద్దు. వెంటనే ఈ విషయాన్ని మీ తల్లిదండ్రులకు లేదా స్నేహితులకు చెప్పండి. ఏమాత్రం సంకోచించకుండా డయల్ 100కు కాల్ చేయండి. మీకు అండగా పోలీసులు ఎల్లప్పుడూ ఉంటారు" అని ఆయన భరోసా ఇచ్చారు. తల్లిదండ్రులు కూడా పిల్లలతో సమయం గడుపుతూ, వారు ఆన్‌లైన్‌లో ఎవరితో మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉండాలని సూచించారు.

కేటుగాళ్లకు హెచ్చరిక: ఎక్కడున్నా పట్టుకుంటాం!

నకిలీ ప్రొఫైళ్లు, వీపీఎన్‌లు వాడితే పోలీసులకు చిక్కమని భ్రమపడే సైబర్ నేరగాళ్లకు సీపీ గట్టి హెచ్చరిక జారీ చేశారు. "మీరు ఎక్కడ దాక్కున్నా సరే, సాంకేతిక పరిజ్ఞానంతో మిమ్మల్ని పట్టుకొచ్చి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరు" అని ఆయన స్పష్టం చేశారు. ఆడపిల్లలు ఆన్‌లైన్‌లో అప్రమత్తంగా ఉంటూ, అన్యాయం జరిగితే ధైర్యంగా ముందుకు రావాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+