పెనుభూతమైన అనుమానం, మరొకరితో చనువుగా ఉంటుందనే, రాంనగర్‌లో యువతి హత్యపై సీపీ
మరొకరిని ప్రేమిస్తుందనే అనుమానంతోనే హారతిని షాహిద్ మట్టుబెట్టాడని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. మరొకరితో చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్నాడని తెలిపారు. అతనిని ప్రేమిస్తూ.. తనకు ఎక్కడ దూరమవుతోందనే భయంతో రగిలిపోయాడని వివరించారు. పక్కా ప్రణాళిక ప్రకారం తన గదికి పిలిపించి హత్య చేశాడన్నారు. హారతి హత్య గురించిన వివరాలను శనివారం సీపీ రవీందర్ మీడియాకు వెల్లడించారు.

అనుమానమే
అనుమానంతో రగిలిపోతున్న షాహిద్.. శుక్రవారం హారతిని తన గదికి రావాలని పిలిచాడు. అతని మదిలో ఇంత పాడు ఆలోచన ఉంటుందని గ్రహించని యువతి నమ్మి వచ్చేసింది. తర్వాత ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారని.. తర్వాత లైంగికదాడి కూడా చేశాడని సీపీ రవీందర్ తెలిపారు. రేప్ చేశాక.. మరో యువకుడి గురించి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసిందని వెల్లడించారు.

కోపంతో రగిలిపోయి
మాట్లాడుతుండగానే కోపోద్రిక్తుడైన షాహిద్.. తన గదిలో ఉన్న కత్తితో గొంతుకోశాడని సీపీ తెలిపారు. పథకం ప్రకారం రూమ్‌కు రప్పించి అత్యాచారం చేసి, గొంతుకోసి హతమార్చాడని వివరించారు. నిందితుడు షాహిద్‌పై 302, 376, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

మరొకరితో చనువు..
హన్మకొండ రాంనగర్‌లో నిందితుడు షాహిద్ ఉంటున్నాడు. హారతి-షాహిద్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమె మరొకరితో చనువుగా ఉండటం, అతనిని ప్రేమిస్తుందనే షాహిద్ మదనపడ్డారు. మాట్లాడుదామని శుక్రవారం పిలిపించాడు. రూమ్‌కి వచ్చాక షాహిద్, హారతి కాసేపు బాగానే ఉన్నారు. తన మనసులో ఉన్న అనుమాన భూతాన్ని షాహిద్.. బయటకి తీశాడు. వేరేవాళ్లతో చనువుగా ఉంటున్నారనే అంశంపై డిస్కషన్ కూడా జరిగింది. దీంతో ఆవేశానికి గురైన షాహిద్.. తన గదిలో ఉన్న కత్తితో హారతి గొంతుకోశాడు. ఆమె రక్తపుమడుగులు కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకొచ్చాడు.

పీఎస్‌కు వెళ్లి..
నేరుగా సుబేదారి పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. తాను యువతిని హతమార్చానని చెప్పడంతో.. పోలీసులు అతని గదికి వచ్చారు. అయితే అతని పక్క గది, చుట్టుపక్కల ఉన్నవారికి కూడా యువతి హత్య గురించి తెలియదు. పోలీసులు రావడంతో ఏం జరిగిందని ఆరాతీశారు. యువతి హత్య జరిగిందని తెలియడంతో జనాలు గుమిగూడారు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications