సాయిబాబాపై స్వరూపానంద తీవ్ర వ్యాఖ్యలు
హైదరాబాద్: స్వరూపానంద స్వామికి వ్యతిరేకంగా దిల్ షుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాలంలో తరుచు సాయిబాబాను అవమాన పరిచే విధంగా అసభ్యకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన స్వరూపానంద స్వామికి వ్యతిరేకంగా దిల్ షుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వరూపానంద కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ తీశారు. ఎవరైనా సరే సాయి నాధునికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదనన్నారు. వారి ఉనికిని కాపాడుకునే క్రమంలోనే ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి సంచలనంలో ఉండటానికి ప్రయత్నిస్తారని, భక్తుల మధ్య, రెండు కులాల మధ్య రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రశ్నించడానికి వచ్చిన సాయి భక్తులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications