సజ్జనార్ బదిలీ వెనుక, అసలు ఏం జరిగింది..!?
హైదరాబాద్ సిపీ సజ్జనార్ ఆకస్మిక బదిలీ. ఇప్పుడు పవర్ కారిడార్స్ లో ఈ విషయం పైన ఆసక్తి -కర చర్చ కొనసాగుతోంది. మంచి అధికారిగా పేరున్న సజ్జనార్ బదిలీ వెనుక కారణాలు ఏంటనే విశ్లేషణలు మొదలయ్యాయి. సీపీ గా తప్పిస్తూ అప్రాధాన్యత పదవి కేటాయించటం పైనే ఈ చర్చ మొత్తం వినిపిస్తోంది. తన బదిలీ పైన సజ్జనార్ స్పందించారు. అయితే, అసలు కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.
తెలంగాణ ప్రభుత్వం ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. అందులో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్‌ను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాధ్యతల నిర్వహణలో సజ్జనార్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏ హోదాలో ఉన్నా.. తన మార్క్ నిరూపించుకోవటంలో సజ్జనార్ సక్సెస్ అవుతూ వచ్చారు. బీఆర్ఎస్ హయాంలోనూ సజ్జనార్ కు ప్రాధాన్యత దక్కింది. ఆర్టీసీ ఎండీగానూ సజ్జనారం తన పట్టు నిరూపించుకున్నారు. సీవీ ఆనంద్ ను హైదరాబాద్ సీపీ పదవి నుంచి బదిలీ చేసిన తరువాత ఆ స్థానంలో ప్రభుత్వం ఏరి కోరి సజ్జనార్ ను ఎంపిక చేసి హైదరాబాద్ సీపీగా బాధ్యతలు అప్పగించింది. 14 నెలల పాటు ఆయన ఈ హోదాలో కొనసాగారు. అయితే, కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కీలక ఘటనల నేపథ్యంలోనే సజ్జనార్ ను బదిలీ చేసినట్లు ప్రచారం సాగుతోంది.

స్పందించిన సజ్జనార్
అయితే, బీఆర్ఎస్ నేతలు గతంలో కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న ఘటనల వేళ పరోక్షంగా సజ్జనార్ తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. నగరంలో పోలీసింగ్ విషయంలో మాత్రం సజ్జనార్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించారు. కాగా.. సీపీ వంటి కీలక స్థానంలో కొనసాగుతున్న సజ్జనార్‌ను ఇప్పుడు హఠాత్తుగా అగ్నిమాపక, విపత్తు నిర్వహణ విభాగానికి మార్చడం వెనుక అసలేం జరిగిందన్న దానిపై స్పష్టమైన క్లారిటీ లేకపోవడంతో రకరకాల ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అయితే, సజ్జనార్ తిరిగి కీలక హోదాలోకి వస్తారనే ప్రచారమూ వినిపిస్తోంది. ఇంట్లో శుభకార్యం కోసం సజ్జనార్ సెలవు పైన వెళ్తున్నారని తెలుస్తోంది. కాగా, 2028 అక్టోబర్ లో రిటైర్మెంట్ కానున్నారు. ఇక.. సజ్జనార్ తన బదిలీ పైనా స్పందించారు. హైదరాబాద్ సీపీగా పని చేసిన కాలం అపురూప ప్రయాణంగా పేర్కొన్నారు. తనకు అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.












Click it and Unblock the Notifications
