పవన్ కళ్యాణ్‌కు సమంత పోటీ!: మంత్రి కేటీఆర్‌ను కలిసిన బ్యూటీ
ఇప్పటికే చేనేతకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు సమంత కూడా ముందుకు వచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేనేతకు మద్దతు పలకాలని ఇచ్చిన పిలుపుకు ప్రముఖ నటి సమంత స్పందించారు. ఆమె మంగళవారం నాడు చేనేతకు మద్దతు పలికారు.
సాయంత్రం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ఆమె కలిశారు. చేనేతను ప్రోత్సహించేందుకు సిద్ధమని చెప్పారు. రాష్ట్ర చేనేత సహకార సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు సిద్ధమని తెలిపారు.

చేనేత సహకారసంస్థ టీఎస్‌పీవో కార్యక్రమాలతో కలిసి పని చేస్తానన్నారు. ఈ సందర్భంగా సమంతకు మంత్రి కేటీఆర్ పోచంపల్లి చీరను బహుకరించారు.
కాగా, ఇప్పటికే చేనేతకు పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ముందుకు వచ్చారు. ఇప్పుడు సమంత కూడా ముందుకు వచ్చారు. అయితే, బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరైనా, ఎందరైనా ఉండవచ్చు.












Click it and Unblock the Notifications