Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఛలో ఆర్కే బీచ్!: ఏపీ హోదాకు తెలంగాణ నటుడు సంపూర్ణేష్ బాబు మద్దతు

ప్రముఖ నటుడు, తెలంగాణ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రత్యేక హోదాకు మద్దతు పలికారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెరీనా బీచ్ మొదలు తమిళనాడులో ప్రతి గ్రామంలో యువత రోడ్డెక్కింది.

హైదరాబాద్: ప్రముఖ నటుడు, తెలంగాణ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రత్యేక హోదాకు మద్దతు పలికారు. తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మెరీనా బీచ్ మొదలు తమిళనాడులో ప్రతి గ్రామంలో యువత రోడ్డెక్కింది.

జల్లికట్టు కావాలని తమిళ యువత నినదించడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దిగి వచ్చి, ఆర్డినెన్స్ జారీ చేశాయి. ఈ నేపథ్యంలో జల్లికట్టును ఆదర్శంగా తీసుకోని ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి చీఫ్ జగన్ సహా పలువురు చెబుతున్నారు.

 Sampoornesh Babu supports Special Status for AP

ఈ నేపథ్యంలో సంపూర్ణేష్ బాబు ప్రత్యేక హోదా పైన పరోక్షంగా స్పందించారు. చాలామంది తమ ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్‌ను, కవర్ ఫోటోను ప్రత్యేక హోదాకు మద్దతుగా పెట్టుకుంటున్నారు. సంపూర్ణేష్ బాబు కూడా అలాగే చేశారు.

హక్కుల సాధన కోసం పోరాడటంలో తెలుగు వారంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాకు మద్దతుగా తన ఫేస్‌బుక్ కవర్ ఫోటోను మార్చాడు. ట్విట్టర్‌లో హోదాకు మద్దతుగా ట్వీట్లు చేశారు.

కాగా, సంపూర్ణేష్ బాబుది తెలంగాణలోని సిద్దిపేట. ఈ నెల 26వ తేదీన విశాఖలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించనున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి అతను మద్దతు పలుకుతున్నారు. కాగా, సంపూర్ణేష్ బాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని. మరో హీరో తనీష్ కూడా ప్రత్యేక హోదాకు మద్దతుగా నిలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+