సంచలన తీర్పు: ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసు దోషికి ఉరిశిక్ష

సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఐదేళ్ల బాలికపై హత్యాచారం కేసులో దోషికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. నిందితుడు చేసిన నేరం తీవ్రమైనదిగా పరిగణించి మరణశిక్షను విధించింది కోర్టు.

బీహార్ రాష్ట్రానికి చెందిన గఫార్ అలీ(56) గత సంవత్సరం బీడీఎల్ బానూరులో ఐదేళ్ల బాలికకు కూల్ డ్రింక్స్‌లో మద్యం కలిపి తాగించి.. అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే అనుమానంతో హత్య చేశాడు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత దర్యాప్తు చేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు.

Sangareddy court sentenced the convict to death in the rape and murder case of a five-year-old girl

నిందితుడిపై నేరాభియోగానికి సంబంధించి ప్రాసిక్యూషన్ తగిన సాక్ష్యాధారాలను చూపించడంతో గఫార్‌కు మరణ దండన విధిస్తూ సంగారెడ్డి జిల్లా కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కాగా, ఈ ఘటన జరిగి 11 నెలలు అవుతోంది. తక్కువ సమయంలోనే దోషికి ఉరిశిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో 27 ఏళ్ల తర్వాత మరణశిక్ష విధించారు.

ఘోరం: శిశువును కాలువలో విసిరేసిన దుండగులు

గుర్తు తెలియని వ్యక్తులు మూడు రోజుల మగ శిశువును మూటలో కట్టి కెనాల్ పక్కకు విసిరేసి వెళ్లిపోయారు. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లా తుమ్మనల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం అందించడంతో పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని శిశువును ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ కెనాల్ పక్కన కొందరు ఓ పసికందును విసిరేశారు. అటువైపుగా వెళ్తున్న చొక్కారెడ్డి అనే రైతు పసికందు ఏడుపు విని దగ్గరికెళ్లాడు. కెనాల్ పక్కన ఓ మూటలో మగ శిశువు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ శిశువును ఆస్పత్రిలో చేర్పించారు. ఆ శిశువు జన్మించి మూడు రోజులు అవుతుందని, శిశువు శరీరంపై గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+