Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేడీ డాన్ సంగీత: సంపన్నుల పిల్లలకు డ్రగ్స్, వ్యభిచారంలోకి, నగ్న ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్

నైజీరియన్ ముఠాతో కలిసి మాదక ద్రవ్యాల(డ్రగ్స్) వ్యాపారం చేస్తూ.. లేడీ డాన్‌గా మారిన విజయవాడకు చెందిన యువతి పాలకుర్తి సంగీత పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలిసింది.

హైదరాబాద్: నైజీరియన్ ముఠాతో కలిసి మాదక ద్రవ్యాల(డ్రగ్స్) వ్యాపారం చేస్తూ.. లేడీ డాన్‌గా మారిన విజయవాడకు చెందిన యువతి పాలకుర్తి సంగీత పోలీసుల విచారణలో సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలిసింది. సంపన్నుల పిల్లలకు వలవేసి వారికి డ్రగ్స్ సరఫరా చేసినట్లు సమాచారం.

వ్యభిచారంలోకి, నగ్నం ఫొటోలు తీసి..

వ్యభిచారంలోకి, నగ్నం ఫొటోలు తీసి..

అంతేగాక, పలువురు యువతులను బలవంతంగా వ్యభిచార కూపంలోకి కూడా దించినట్లు పోలీసుల విచారణలో సంగీత వెల్లడించినట్లు తెలిసింది. తమకు ఎదురుతిరిగిన యువతుల నగ్న ఫొటోలు, వీడియోలు తీసి వారిని బ్లాక్ మెయిల్ చేసినట్లు సంగీత చెప్పినట్లు సమాచారం.

Recommended Video

    Kajal Aggarwal, Raashi Khanna And Lavanya Tripathi Names In Drugs Scandal
    విజయవాడ నుంచి హైదరాబాద్‌కు..

    విజయవాడ నుంచి హైదరాబాద్‌కు..

    విజయవాడకు చెందిన పాలకుర్తి సంగీతకు పెళ్లైన 6నెలలకే భర్త చనిపోయాడు. అనంతరం విజయవాడలోని ఓ కాల్‌సెంటర్‌లో పని చేస్తున్న సమయంలో ఆమెకు

    ఆన్‌లైన్ చాటింగ్‌లో నైజీరియన్ మహిళ పరిచయమైంది. ఆ తర్వాత సంగీత తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది. నగరానికి వచ్చిన తర్వాత మహిలతోపాటు నైజీరియన్ ముఠాతో ఆమెకు స్నేహం పెరిగిందని పోలీసుల విచారణలో తేలినట్లు తెలిసింది.

    డ్రగ్స్ దందాలో కీలకంగా..

    డ్రగ్స్ దందాలో కీలకంగా..

    ఆ తర్వాత నైజీరియన్ ముఠాలోని సోమాయిల్ జాన్‌తో ప్రేమలోపడిన సంగీత.. గత సంవత్సరం నుంచి డ్రగ్స్ వ్యవహారంలో కీలకంగా మారింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ సన్‌సిటీలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని ఇతర నైజీరియన్లతో కలిసి ఉంటోంది. కాస్మోస్.. గాబ్రిల్ అనే స్నేహితుడి సహాయంతో కొకైన్, బ్రౌన్ షుగర్, అంఫిటమైన్ టాబ్లెట్లను తీసుకొచ్చి.. తన స్నేహితులైన జాన్, సిరిల్, హెన్రీ, సంగీతలతో కలిసి హైదరాబాద్‌లో సరఫరా చేస్తున్నాడు.

    సంగీత అరెస్టుతో గుట్టురట్టు..

    సంగీత అరెస్టుతో గుట్టురట్టు..

    సంగీత పేరు మీద బ్యాంకు ఖాతా, డెబిట్ కార్డు తీసుకుని వినియోగిస్తున్నాడు. జాన్, సిరిల్‌లు నిజాం కాలేజీలో డిగ్రీ చదువుతున్నారు. కొందరు నైజీరియన్లు డ్రగ్స్ విక్రయిస్తున్నారనే సమాచారంతో రాచకొండ ఎస్ఓటీ, ఎల్బీనగర్ పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే జులై 23న ఎల్బీనగర్ బస్టాపులో సంగీతను, జాన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మూడు గ్రాముల కొకైన్, 200గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సంగీత వెల్లడించిన వివరాల మేరకు సన్ సిటీలోని నివాసం, ఇతర ప్రాంతాల్లో దాడి చేసి చేసి కాస్మోస్ తోపాటు సిరిల్, మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

    విద్యార్థులకు స్వయంగా.. అమ్మాయిల సరఫరా..

    విద్యార్థులకు స్వయంగా.. అమ్మాయిల సరఫరా..

    కాగా, సంగీత.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు స్వయంగా మత్తుమందులను విక్రయించేదని, వారిని తన ఇంటికి ఆహ్వానించి, అమ్మాయిలను సరఫరా చేసిందని తెలిసింది. సంగీత ఉచ్చులో బంజారాహిల్స్‌కు చెందిన ప్రముఖుల పిల్లలున్నారని గుర్తించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో ఆరుగురు వ్యాపారుల పిల్లలను ప్రశ్నించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అంతేగాక, సినిమా స్టార్లకు కూడా డ్రగ్స్ సరఫరా చేసిందా? అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తయితే గానీ, మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+