ఆకర్షణీయం అంటే అది కాదు, గట్స్ ఉండాలి: షరపోవాపై సానియా

హైదరాబాద్: ఆకర్షణీయమంగా కనిపించడం అంటే శరీరపు రంగు బాగుండటం కాదని, ఆరోగ్యంగా, బలంగా, కండరాల బలమని, సన్నగా ఉంటే మాత్రమే అట్రాక్టివ్ అని తాను భావించనని సానియా మీర్జా చెప్పింది. ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే అట్రాక్టివ్ అంది.

కొద్ది రోజుల్లో ఆమె పుస్తకం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన జీవిత చరిత్రను తెరకెక్కించాలని జరుగుతున్న ప్రయత్నాలపై తానేమీ మాట్లాడబోనని చెప్పింది. తన ఆలోచన కార్యరూపం దాల్చాలంటే, మరికొన్నేళ్లు వేచి చూడాలంది.

ఇటీవలి పరాజయాలను ప్రస్తావిస్తూ..పరాజయాలు ప్రతి ఒక్కరికీ ఎదురవుతూనే ఉంటాయని, గత వారంలో జకోవిచ్ సైతం ఓడిపోయాడని చెప్పంది. ఈ సంవత్సరం గ్రాండ్ స్లామ్ సీజన్లో మార్టినాతో కలిసి తిరిగి ఫాంలోకి వస్తానన్న నమ్మకం ఉందని చెప్పింది.

Sania Mirza says it was gutsy of Maria Sharapova to make announcement

రియో ఒలింపిక్స్‌లో మిక్సెడ్ డబుల్స్‌లో పతకం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అభిప్రాయపడింది. సరైన భాగస్వామి లేకపోవడమే కారణమంది. సింగిల్స్, డబుల్స్‌లో పతకం వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించడం లేదని, అయితే, బలమైన జట్టును పంపితే, పతకం కోసం గట్టిగా ప్రయత్నించవచ్చంది.

మరియా షరపోవా పైన కూడా స్పందించింది. అలా అంగీకరించేందుకు గట్స్ ఉండాలని సానియా మీర్జా అభిప్రాయపడింది. ఇటీవల తాను పదేళ్లుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్లు షరపోవా చెప్పింది. దీనిపై సానియా స్పందించారు. షరపోవా ఆ తప్పును తన పైనే వేసుకుందని గుర్తు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+