సంజయ్‌దత్ పేరు ఒకవేళ సిద్దిఖీ బాబా అయితే: విడుదలపై అసదుద్దీన్
ముంబై: బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విడుదల పైన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ తనదైన తీరులో స్పందించారు. 'సంజయత్ దత్ పేరు సిద్దిఖీ బాబా అయితే ఏమయ్యేది? మతపరమైన చర్యలకు దారి తీసేదం'టూ ట్వీట్ చేశారు.
జర్నలిస్ట్ రాణా అయూబ్ ట్వీట్‌ను ఉదహరిస్తూ అసదుద్దీన్ అలా స్పందించారు. '1993 బాంబు పేలుళ్ల కేసులో మిగిలిన నిందితులందరూ జీవిత కాల శిక్షను ఎదుర్కొంటుంటే.. సంజు బాబా మాత్రం ఘన స్వాగతం అందుకున్నారు. ఇది వంచన' అంటూ జర్నలిస్టు అయూబ్ ట్వీట్ చేశారు.

1993 బాంబు పేలుళ్ల సందర్భంగా అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నందుకు ఐదేళ్ల జైలు శిక్షను సంజయ్ దత్‌కు కోర్టు విధించింది. అయితే, 42 నెలలకే ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం విముక్తి కల్పించింది. విడుదల సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications