చర్లపల్లి- విశాఖపట్నం జన్‌సాధారణ్ స్పెషల్ టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ ఇవే

Sankranti special trains: ఇంకో రెండు రోజుల్లో తెలుగు లోగిళ్లల్లో సంక్రాంతి పండగ సందడి నెలకొనబోతోంది. దీనికోసం రెండు తెలుగు రాష్ట్రాలు సిద్ధమౌతోన్నాయి. ఇంటి ముందు రంగవల్లులు, కోడిపందేలు, గంగిరెద్దుల ఆటలతో వారం రోజుల పాటు ఏపీ, తెలంగాణల్లో పండగ కోలాహలం ఏర్పడనుంది.

సంక్రాంతి పండగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని అధిగమించడానికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు 52 అదనపు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడతో పాటు కొత్తగా అందుబాటులోకి వచ్చిన చర్లపల్లి స్టేషన్ నుంచీ ఆయా రైళ్లు ఏపీ, తెలంగాణల్లో వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించనున్నాయి.

Sankranti 2025 SCR to run Jansadharan Special Trains from Charlapalli to Visakhapatnam

తాజాగా చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి రెండు జన్‌‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. తొలి ఎక్స్‌ప్రెస్ ఈ సాయంత్రం చర్లపల్లి నుంచి విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనుంది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ సాయంత్రం 4:15 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరి వెళ్లే నంబర్ 07245 జన్ సాధారణ్ ఎక్స్‌ప్రెస్.. ఆదివారం ఉదయం 7 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆదివారం ఉదయం 8 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరే నంబర్ 07246 ఎక్స్‌ప్రెస్ అదే రోజు రాత్రి 9:20 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలి, దువ్వాడ మీదుగా ఈ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు సాగిస్తుంది. అన్ని సెకెండ్ జనరల్ క్లాస్ కోచ్‌లే ఉంటాయి ఈ రైలుకు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+