27 సుగంధ ద్రవ్యాలతో పట్టుచీర: సిరిచందన పట్టుగా నామకరణం

చేనేత కార్మికుల‌కు సిరిసిల్ల పుట్టినిల్లు. నేత‌న్న‌ల చేతుల్లో వినూత్న వ‌స్త్రాలు త‌యార‌వుతున్నాయి. సిరిసిల్ల నేత‌న్న‌లు నేసే ప‌ట్టు చీర‌ల‌కు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. వ‌స్త్రాలను నేసే ఇక్క‌డి నేత‌న్న‌లు కొత్త త‌ర‌హా ప‌ద్ద‌తిని అవ‌లంబిస్తుంటారు. వినూత్న రీతుల్లో చీరలను నేస్తారు.తాజాగా అలా ఒక చీరను నేశారు.

సిరిసిల్ల‌కు చెందిన చేనేత కార్మికుడు న‌ల్ల విజ‌య్ కొత్తగా ఆలోచ‌న చేశాడు. 27 సుగంధ ద్ర‌వ్యాల‌తో ప‌ట్టు చీర‌ను నేశాడు. ఇత‌ర ప‌ట్టుచీరల మాదిరే దీనికి వినియోగించిన దారాల‌ను సుగంధ ద్ర‌వ్యాల‌తో కూడిన ద్రావ‌ణంలో ముంచి నేశాడు. ఆ చీర‌ను అలా విప్ప‌గానే సువాన‌స విర‌జిమ్ముతున్నాయి. ఈ చీర‌ను శ‌నివారం మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్ రావు ఆవిష్క‌రించారు. చీర నేసిన విజ‌య్‌ను మంత్రులు అభినందించారు.

saree weaved by 27 types of scents

మరమగ్గంపై పరిమళాలు వెదజల్లే పట్టుచీరను తయారు చేసి విజయ్ ప్రతిభ చాటాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గల సాయినగర్‌కు చెందిన నేత కార్మికుడు నల్ల విజయ్‌.. ఇప్పటి వరకు అగ్గి పెట్టెలో పట్టే చీర నుంచి మొదలుకుని దబ్బనంలో దూరే చీరలు తయారు చేశాడు. 27 రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి పరిమళాలు వెదజల్లే పట్టుచీరను మరమగ్గంపై నేసి.. అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

విజయ్ విజ్ఞప్తి మేరకు ఈ చీరకు సిరి చందన పట్టుగా మంత్రులు నామ‌క‌ర‌ణం చేశారు. గతంలో మూడు కొంగుల చీర, ఉంగరంలో, దబ్బనంలో దూరే చీరలను, కుట్టు లేని లాల్చి, పైజామా, జాతీయ జెండాను తయారు చేసి ప్రశంసలు అందుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+