వీడుతున్నసారిక, పిల్లల మృత్యుమిస్టరీ: పెట్రోల్ పోసి కాల్చేశారా?

హైదరాబాద్: సారిక, ముగ్గురు పిల్లల దేహాలను చూస్తే పెట్రోల్ మీద పడి నిప్పుతో కాలినట్లు అర్థమవుతోందని అంటున్నారు. అయితే, సారిక పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పటించి, తాను నిప్పటించుకుందా అనేది ఒక కోణం కాగా, ఆ నలుగురిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారా అనేది మరో కోణం. సారిక పిల్లల మృతదేహాలు పూర్తిగా కాలిపోయాయి. సారికకు మత్తుమందు ఇచ్చి బెడ్‌పై కాల్చేశారని, ఆ తర్వాత పిల్లలను చంపేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. బెడ్రూంలో ఉన్న గ్యాస్ లీక్ కాలేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సిలిండర్‌లో గ్యాస్ కూడా లేదని, అక్కడ స్టౌవ్ కూడా లేదని చెబుతున్నారు. సారిక శరీరం ముందుభాగం మాత్రమే కాలిపోయింది.

పిల్లలు కాలిపోయిన తీరును బట్టి హత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. గ్యాస్ లీక్ కాలేదని క్లూస్ టీమ్ నిర్ధారణకు వచ్చింది. పోస్టుమార్టం నివేదిక రేపు గురువారం వచ్చే అవకాశం ఉంది. అది వస్తే పూర్తిగా మరణాలకు సంబంధించిన మిస్టరీ వీడవచ్చునని భావిస్తున్నారు. రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసులు బుధవారంనాడు విడివిడిగా విచారించారు.

కాంగ్రెసు నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్య కోడలు సారిక, ఆమె పిల్లలది హత్యనే అనుమానాలు కలుగుతున్నాయి. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లి లలిత, సోదరి అర్చనలతో పాటు స్థానికులు కూడా అంటున్నారు. మొత్తం మీద, ఆ మరణాల చుట్టూ పలు అనుమానాలు ముసురుకున్నాయి. రాజయ్య కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

కూతురు పరిస్థితి చూసి ఆమె తండ్రి మంచాన పడ్డాడని సారిక తల్లి లలిత ఆవేదన వ్యక్తం చేసింది. కాంగ్రెసు నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. సారిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రాజయ్యపై, సారిక భర్త అనిల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Sarika's mother accuses Rajaiah's family

తన కూతురు సారిక దసరాకు ఇంటికి వచ్చిందని లలిత చెప్పారు. ముగ్గురు పిల్లలను పెంచడం సారికకు కష్టంగా మారిందని ఆమె అన్నారు. తన కూతురు సారికను, తన మనవళ్లను చంపినవాళ్లను అలాగే చంపాలని ఆమె ఆక్రోశంతో అన్నారు. సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదని ఆమె అన్నారు.

తన కూతురిని, మనవళ్లను చిత్రహింసలు పెట్టి హత్య చేశారని ఆమె ఆరోపించారు. రాజయ్య కుమారుడు అనిల్ రెండో పెళ్లి చేసుకున్నాడని చెప్పారు తన కూతురిని, మనవళ్లను వైదొలిగించుకోవడానికి వారి ప్రాణాలు తీశాడని ఆమె ఆరోపించారు. రాజయ్యకు, ఆయన భార్యకు డబ్బు పిచ్చి చాలా ఎక్కువ అని అని లలిత అన్నారు. తాను ఉండగానే తన బిడ్డ ఎన్నో బాధలు పడ్డదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు.

తన చెల్లే సారిక ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని సోదరి అర్చన అన్నారు. ఆమె మృతిపై తమకు అనుమానాలున్నాయని అన్నారు. గతంలోనూ చాలాసార్లు వేధించారని అన్నారు. అత్త, మామ, భర్త సారికను హతమార్చారని ఆమె ఆరోపించారు. రాజయ్య కుటుంబ సబ్యులను వదలొద్దని, వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+