శాతవాహన, సిల్చార్ ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో నడిచే రెండు కీలక రైళ్ల రూట్స్ లో మార్పు జరిగింది. ఇప్పటివరకూ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఈ రెండు రైళ్లను ఇకపై కాచిగూడ, చర్లపల్లి స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే విధంగా మార్పు చేశారు. ఈ మార్పులు ఎప్పటి నుంచో అమల్లోకి వస్తాయన్న దానిపై ఇవాళ దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టమైన ప్రకటన చేశారు. కాబట్టి ఈ రైళ్లలో ప్రయాణించే వారు ఈ మార్పులు గమనించాల్సి ఉంటుంది.
విజయవాడ జంక్షన్ లో ఉదయం 6.25కు బయలుదేరి మధ్యాహ్నం 12.55కు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరాల్సిన శాతవాహన ఎక్స్ ప్రెస్ రూటులో మార్పు చేశారు. ఈనెల 15వ తేదీ నుంచి శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలును సికింద్రాబాద్ స్టేషన్ కు కాకుండా కాచిగూడ స్టేషన్ కు మళ్లిస్తున్నారు. అలాగే అదే రోజు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి సాయంత్రం 4 గంటలకు బయలుదేరే శాతవాహన ఎక్స్ ప్రెస్ రైలును కూడా కాచిగూడ నుంచి బయలుదేరేలా మార్పు చేశారు.

అలాగే సికింద్రాబాద్-సిల్చార్ మధ్య ప్రయాణించే ఎక్స్ ప్రెస్ రైలును సైతం ఇకపై చర్లపల్లి స్టేషన్ కు ప్రయాణించేలా మార్పు చేశారు. ఈ నెల 9వ తేదీ నుంచి రాత్రి 7.30కి సిల్చార్ లో బయలుదేరే రైలును చర్లపల్లికి మరుసటి రోజు తెల్లవారు జామున 4.20కి చేరుకునేలా షెడ్యూల్ చేశారు. అలాగే ఈ నెల 12వ తేదీ నుంచి చర్లపల్లిలో సాయంత్రం 4.50కి బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలును రాత్రి 11.40కి సిల్చార్ చేరుకునేలా షెడ్యూల్ చేశారు.












Click it and Unblock the Notifications