Sankranti 2026 : వాహనదారులకు అలర్ట్. టోల్ ప్లాజా కొత్త రూల్!
సంక్రాంతికి రద్దీ ఎలా ఉంటుందో మనకి తెలియంది కాదు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పల్లెకు బయలుదేరే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇలాంటి టైంలో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది కూడా. హైదరాబాద్ ట్రాఫిక్ చక్ర బంధాన్ని దాటుకుని బయటపడిన వెంటనే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ముందుగా తగిలే టోల్ ప్లాజ్ పతంగి.. ఇక ఇక్కడ టోల్ ఛార్జ్ కట్టడానికి వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతాయి. ఈ క్రమంలోనే కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)
టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ను తగ్గించడానికి ఫాస్టాగ్ విధానం అమలులోకి తీసుకువచ్చింది కేంద్రం. దీని ద్వారా వేచి ఉండే సమయం చాలా తగ్గింది. అయితే పండుగ సమయంలో రోజువారితో పోల్చితే పది రేట్లు ఎక్కువ వాహనాలు టోల్ ప్లాజా దాటతాయి. ప్రస్తుతం ఉన్న 30 సెకన్లలోపు టోల్ ఫీజుల చెల్లింపు విధానాన్ని కూడా మార్పు చేసేందుకు NHAI సిద్ధమైంది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం సాయంత్రం శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ ఫీజు వసూలు చేసేందుకు సంబంధించిన ట్రయల్ రన్‌ను నిర్వహించారు.

సాధారణంగా ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఫాస్ట్ ట్యాగ్ ను మూడు సెకన్లలలో స్కాన్ చేసే విధానం అమలులో ఉంది. అయితే రద్దీ సమయంలో స్కానింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉంది. శుక్రవారం నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారి శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్ ఫాస్ట్ ట్యాగ్ విధానానికి ట్రయల్ రన్ నిర్వహించారు. దీని ద్వారా 100 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు ఆటోమేటిక్ స్కాన్ అవుతాయి. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ఎన్ని వాహనాలు స్కాన్ అవుతున్నాయి.. ఎన్ని స్కాన్ కావడం లేదనేది.
పతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల నంబరును కెమెరా గుర్తించిందా... సెన్సర్ ద్వారా టోల్ ఫీజు కట్టించుకున్నారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని వాహనాల నుంచి టోల్ వసూలు కావడం లేదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దీన్ని పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. అన్ని సక్రమంగా జరిగితే మీ బండి ఫాస్టాగ్‌ను సెన్సర్ మూడు సెకన్లలోనే స్కాన్ చేస్తుంది. ఎలాంటి ఆటంకం లేకపోతే బూత్ నుంచి నిమిషానికి 20 వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉంది.
పంతంగి టోల్‌ప్లాజా వద్ద మొత్తం 16 టోల్‌బూత్ కౌంటర్లున్నాయి. గురువారం ఒక్కో బూత్‌లో అరగంట పాటు ట్రయల్ రన్ చేశారు. శుక్రవారం రాత్రి నుంచి రద్దీ ఎక్కువగా ఉంటే విజయవాడ మార్గంలో మరో రెండు టోల్ బూత్‌లను కూడా తెరవనున్నారు. ఈ కౌంటర్లలో హ్యాండ్ గన్ ద్వారా ఫాస్టాగ్‌లను స్కాన్ చేస్తారు. ప్రస్తుతం హ్యాండ్ గన్ తో చాలా చోట్ల ఫాస్ట్ ట్యాగ్ స్కాన్ చేస్తున్నారు. అయితే ... హైదరాబాద్-విజయవాడ హైవేపై ఒక్క పంతంగి టోల్ ప్లాజా వద్దే శాటిలైట్ ద్వారా ఆటోమేటిక్‌గా టోల్ ఫీజు వసూలు విధానం అమలు చేయనున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications