చరిత్ర సృష్టించిన ఇస్రో: శాటిలైట్ తయారీలో హైదరాబాద్ పాత్ర
శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ37 వాహన నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది. 104 ఉపగ్రహాలను ఇది తీసుకు వెళ్లింది.
హైదరాబాద్: శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ37 వాహన నౌక నింగిలోకి దూసుకు వెళ్లింది. 104 ఉపగ్రహాలను ఇది తీసుకు వెళ్లింది. దీంతో షార్ చరిత్ర సృష్టించింది. అయితే, ఇందులో హైదరాబాద్ పాత్ర కూడా ఉంది.
భాగ్యనగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల నిర్వాహకులు రక్షణ రంగానికి సంబంధించిన విడి భాగాల తయారీలోనూ పేరొందారు. తాజాగా గగనానికి చేరనున్న మరో ప్రతిష్ఠాత్మక ఉపగ్రహ వాహక నౌకకు కొన్ని విడి భాగాలను ప్రశాంత్‌నగర్‌లోని నాగసాయి ప్రెసెషియన్ ఇంజినీర్స్ ప్రయివేట్ లిమిటెడ్ అందించింది.

దీని నిర్వాహకులు బీఎన్ రెడ్డి పదుల సంఖ్యలో ఉపగ్రహాలు, విమానాల తయారీలో సేవలందించారు. ఈ సంస్థలో తయారయ్యే విడి భాగాలు అన్ని కూడా రక్షణ రంగానికి సంబంధించినవే కావడం గమనార్హం.
బుధవారం నాడు అంతరిక్షంలోకి ఎగిరిన పీఎస్ఎల్వీ సీ37 వాహకనౌకలో వాడిన కొన్ని విడి భాగాలు బీఎన్ రెడ్డి రూపొందించినవి. ఇందులో కొన్నిటిని యుద్ధప్రాతిపదికన తయారుచేసి పంపించారు. రాబోయే రెండేళ్ల వరకు తమకు ఇటువంటి ఆర్డర్లు ఉన్నాయన్నారు.
ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ఎగిసిన నలభైకి పైగా ఉపగ్రహాలలో ముప్ఫై రెండిటికి విడి భాగాలు తయారు చేశారు. విమానాల తయారీలోనూ హెచ్‌ఏఎల్‌కు సేవలు అందిస్తున్నారు. ఎయిర్ బస్ తలుపులో వాడే ఇరవై అయిదు రకాల భాగాలు ఇక్కడ తయారవుతున్నాయి.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications