పాపులర్ యాంకర్ సుమపై సెటైర్లు: అంత ధైర్యం ఎవరిది?

హైదరాబాద్: తెలుగువాళ్లకు యాంకర్ సుమ సుపరిచితురాలు. యాంకర్లలో ఆమె ఓ వెలుగు వెలుగుతున్నారు. సినియారిటీతో పాటు పాపులారిటీ ఉన్న సుమపై పబ్లిగ్గా ఓ వ్యక్తి సెటైర్లు వేశారు. అదీ, జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజీ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆ సెటైర్లు వేశారు. అంత సాహసం చేసిన వ్యక్తి ఎవరో కాదు, ఆమె భర్త రాజీవ్ కనకాల.

'బలవంతుడు, బలహీనుడిని భయపెట్టి జీవించడం ఆనవాయితీగా వస్తోంది. ఫర్ ఎ ఛేంజ్ బలహీనుడి పక్కన ఓ బలం ఉంది'అనే డైలాగ్‌తో విడుదలైన జనతాగ్యారేజ్ టీజర్‌కు విపరీతమైన లైక్స్ వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన జనతాగ్యారేజ్ ఆడియో వేడుకలో యాంకర్ సుమ ఈ డైలాగ్ గురించి ప్రస్తావిస్తూ... ''ఈ బలహీనురాలికి కూడా ఒక బలం ఉంది. నా బలం ఈ సినిమాలో ఒక బలంగా కనిపిస్తుంది. ఆ బలాన్ని స్టేజిమీదకు పిలుస్తున్నాను'' అంటూ ఆమె భర్త రాజీవ్ కనకాలను ఆహ్వానించారు.

Satires on anchor Suma in janatha garrage audio release function

రాజీవ్ స్టేజీ మీదకు వచ్చి తనకు ఇచ్చిన మైక్‌ ద్వారా మాట్లాడుతున్న సమయంలో సుమ తన దగ్గర ఉన్న మరో మైక్‌ను కూడా రాజీవ్‌ నోటి దగ్గర పెట్టారు. అప్పుడు రాజీవ్ స్పందిస్తూ.. ''చూశారా?... ఒక బలహీనుడి పక్కన బలవంతురాలు ఎలా ఉందో. రెండో మైక్ కూడా ఇచ్చింది. సో బలవంతులు ఎప్పుడూ బలహీనులకు రెండో మైక్ ఇస్తూ బలం చేకూరుస్తుంటారు'' అంటూ నవ్వుతూ ఆమెపై సెటైర్ వేశారు.

రాజీవ్ వేసిన ఈ సెటైర్‌కు ప్రేక్షకులతో పాటు సుమ కూడా నవ్వుకున్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉద్వేగంతో మాట్లాడారు. సుమ యాంకరింగ్ కూడా సినిమా విజయానికి తోడ్పడుతుందనే ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+