అమెరికా బాటలో.. సౌదీ? విదేశీ కార్మికులపై మరిన్ని నిబంధనలు?

విదేశీ ఉద్యోగుల విషయంలో సౌదీ అరేబియా కూడా అమెరికా బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

రియాద్: విదేశీ ఉద్యోగుల విషయంలో సౌదీ అరేబియా కూడా అమెరికా బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. విదేశీ కార్మికులపై నిబంధనలు కఠినతరం చేసి.. సౌదీ పౌరులకు ఉద్యోగాలు దక్కే ప్రయత్నాలు మొదలెట్టింది.

సౌదీ ప్రజల్లో నిరుద్యోగ సమస్య తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. విదేశీ కార్మికుల విషయంలో నిబంధనలు మరింత పెంచాలని, సౌదీ పౌరులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలంటూ అక్కడి కంపెనీలపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

సౌదీలో తక్కువ వేతనాలకు.. నిర్మాణ రంగంలో, ఇతరత్రా చిన్న చిన్న పనుల్లో లక్షలాది మంది విదేశీ కార్మికులు పని చేస్తున్నారు. భారతీయులు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సౌదీకి ఉద్యోగాల నిమిత్తం వెళుతుంటారు. విదేశీ కార్మికుల విషయంలో సౌదీ కొత్త నియమ నిబంధనలు అమల్లోకి వస్తే వీరిపై తీవ్ర ప్రభావం పడుతుంది.

Saudi Arabia also trying to increase work force rules like america

ఈ కొత్త పాలసీ వల్ల సౌదీలో నిరుద్యోగం 2020 నాటికి 12.1 నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా. ఈ చర్య వల్ల సౌదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల లక్ష్యం కూడా నెరవేరుతుందని భావిస్తున్నారు.

కొత్త నిబంధనల ప్రభావం సౌదీ అరేబియాలో తక్కువ వేతనాలకు, ప్రమాదకరమైన పనులు చేస్తున్న దాదాపు 12 మిలియన్ల మంది విదేశీ కార్మికులపై పడనుంది. తక్కువ వేతనంతో పనిచేసే విదేశీ కార్మికుల విషయంలో నిబంధనలు కఠినతరం చేస్తే కంపెనీలపై కూడా భారం పడనుంది.

మూడింట రెండు వంతుల మంది సౌదీ ప్రజలు అక్కడి పబ్లిక్ సెక్టార్ లో పని చేస్తున్నారు. కొత్త నిబంధనల ప్రకారం.. 500 నుంచి 2999 మంది ఉద్యోగులున్న కంపెనీలు టాప్ 'ప్లాటినమ్' కేటగిరీలో 100 శాతం సౌదీ పౌరులనే నియమించాల్సి ఉంటుంది. పది శాతం మాత్రమే ఉద్యోగాలిస్తే ఆ కంపెనీలకు 'లోవర్ గ్రీన్' కేటగిరీగా రేటింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఈ రేటింగ్ ప్లాటినమ్ కు 16 శాతం, లోవర్ గ్రీన్ కు 6 శాతంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+