Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు సుప్రీం అక్షింతలు

న్యూఢిల్లీ: కరీంనగర్ జిల్లా వేములవాడ తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) శాసనసభఅయుడు చెన్నమనేని రమేష్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హత పిటిషన్ విచారణలో ఉండగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది.

దీనిపై వారం రోజుల్లోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేను సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సుప్రీం కోర్టు రెండు వారాలపాటు వాయిదా వేసింది. అనర్హహత పిటిషన్ విచారణ ఉన్నా చెన్నమనేని రమేష్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని ఆది శ్రీనివాస్ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. 2014 ఎన్నికల్లో ఆయన టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు.

తెలంగాణ రాష్ట్ర సమితి వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌కు 2013లో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురయింది. ఎమ్మెల్యే రమేష్ భారత పౌరుడు కాదని న్యాయస్థానం తీర్పు చెప్పింది. తప్పుడు ధృవీకరణ పత్రాలు ఇచ్చినందున ఆయన ఎన్నిక చెల్లదని చెప్పింది. ఆయన ద్వంద్వ పౌరసత్వం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విచారణ ప్రక్రియను నిలుపుదల చేస్తూ అంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రెండేళ్ల క్రితం ఎత్తివేసింది.

SC expresses anguish at Chennmaneni Ramesh

ద్వంద్వ పౌరసత్వంపై విచారణ జరిగింది. విచారణ అనంతరం చెన్నమనేని రమేష్ భారత పౌరుడు కాదని న్యాయస్థానం ఇప్పుడు తీర్పు చెప్పింది. కాగా, ప్రొఫెసర్‌గా జర్మనీలో స్థిరపడిన రమేష్ భారత ప్రభుత్వానికి ఏడాది కాలం ఇండియాలోనే ఉన్నట్లు తప్పుడు నివేదికలు సమర్పించి ఇక్కడి పౌరసత్వం పొందారని పేర్కొంటూ ఆది శ్రీనివాస్ అనే అతను కేంద్ర హోంశాఖకు 2009లో ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్ర హోంశాఖ ఎమ్మెల్యే రమేష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

తన పౌరసత్వంపై హోంశాఖ విచారణను నిలిపివేయించాలని కోరుతూ రమేష్ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. దీంతో విచారణపై స్టే ఎత్తివేయాలని కోరుతూ ఆది శ్రీనివాస్ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు గతంలో విధించిన స్టేను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్టే ఎత్తివేయడంతో రమేష్ పౌరసత్వంపై హోంశాఖ విచారణ జరిపి, అతను భారత పౌరుడు కాదని తీర్పు ఇచ్చింది. 2010 ఉప ఎన్నికలకు ముందు రమేష్ టిడిపికి రాజీనామా చేసి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+