చర్లపల్లి- తిరుపతి ప్రత్యేక రైళ్లు పొడిగింపు: ఏపీలో హాల్ట్ స్టేషన్లు.. రెండు రూట్లల్లో
Special Trains: వేసవి సెలవుల్లో రైల్వేకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుంది. వివిధ పుణ్యక్షేత్రాలు, పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించడానికి, దూర ప్రాంతాలకు రాకపోకలు సాగించాలనుకునే వాళ్ల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటుందీ సీజన్‌లో. వాళ్లంతా కూడా రైళ్ల మీదే ఎక్కువగా ఆధారపడుతుంటారు.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దక్షిణ మధ్య రైల్వే అధికారులు- పలు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

గతంలో చర్లపల్లి- తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన 26 ప్రత్యేక రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. రద్దీ నేపథ్యంలో- ప్రయాణికుల నుంచి అందుతున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. చర్లపల్లి నుంచి రెండు మార్గాల్లో తిరుపతికి రాకపోకలు సాగిస్తోన్న ఈ 26 ప్రత్యేక రైళ్లు ఈ నెల మొదటివారంలోనే ముగియాల్సి ఉండగా.. రద్దీ వల్ల చివరి వారం వరకూ పొడిగించింది.
తాజాగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం..
- ఈ నెల 27వ తేదీ వరకు ప్రతి శుక్ర, ఆదివారాల్లో రాత్రి 9:45 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయలుదేరే నంబర్ 07017 ప్రత్యేక రైలు మరుసటి రోజు 11:15 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.
- ఈ నెల 28వ తేదీ వరకు ప్రతి సోమ, శనివారాల్లో సాయంత్రం 4:40 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరే నంబర్ 07018 ప్రత్యేక రైలు మరుసటి రోజు ఉదయం 7:10 నిమిషాలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
- మల్కాజ్ గిరి, కాచిగూడ, ఉందానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, ఒంటిమిట్ట, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
- ప్రతి బుధవారం చర్లపల్లి నుంచి సాయంత్రం 6:50 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07251 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 6:55 నిమిషాలకు తిరుపతికి చేరుకుంటుంది.
- ప్రతి గురువారం తిరుపతి నుంచి సాయంత్రం 6:55 నిమిషాలకు బయలుదేరే నంబర్ 07252 నంబర్ ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
- జనగామ, ఖాజీపేట్, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.












Click it and Unblock the Notifications