మనకు మరో వందేభారత్ సిద్దం - రూట్, షెడ్యూల్ ఇలా..!!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ప్రయాణీకుల నుంచి మరిన్ని ప్రాంతాలకు డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం నడుస్తున్న రైళ్లకు పెరుగుతున్న ఆదరణతో తెలుగు రాష్ట్రాలకు మరిన్ని ప్రాంతాలకు వందేభారత్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సికింద్రబాద్ నుంచి త్వరలో మరో వందేభారత్ ప్రారంభించేందుకు కసరత్తు పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే అధికారుల నివేదిక మేరకు మరో వందేభారత్ పట్టాలెక్కనుంది.

మరో వందేభారత్
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం కీలక మార్గాల్లో వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, సికింద్రాబాద్- విశాఖ పట్నం, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మధ్య ఈ రైళ్లు ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు మరో వందే భారత్ రైలు అందుబాటులోకి రానుంది. చాలా కాలంగా సికింద్రాబాద్ - పూణే మధ్య వందేభారత్ కోసం డిమాండ్ ఉంది. అయితే, దూరం ప్రయాణం కావటంతో వందేభారత్ స్లీపర్ పైన హామీ వచ్చింది. ఇదే సమయంలో మరో వందేభారత్ సర్వీసుకు ఆమెదం లభించినట్లు తెలుస్తోంది.

SCR to launch new Vandebharat between Secunderabad and Nagapur in next month

నాగపూర్ - సికింద్రాబాద్
సికింద్రాబాద్ నుంచి నిత్యం నాగపూర్ కు పెద్ద సంఖ్యలో ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ రూట్ లో వందేభారత్ ప్రవేశ పెట్టాలనే డిమాండ్ ఉంది. ఇప్పుడు దీనికి ఆమోదం లభించినట్లు సమాచారం. సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య కొత్తగా వందేభారత్ సర్వీసు ప్రారంభం కానుంది. ఈ రెండు నగరాల మధ్య 578 కి.మీ దూరం ఉండగా.. కేవలం 7 గంటల్లోనే గమ్య స్థానం చేరేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రైలు ఉదయం 5 గంటలకు నాగ్ పూర్ నుండి బయలు దేరి.. అదే రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకునే వేళలను ఖరారు చేస్తున్నట్లు సమాచారం.

షెడ్యూల్ ఇలా
అదే విధంగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్‌లో బయలు దేరి రాత్రి 8.20 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. కాజీపేట్, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో ఈ రైలుకు హాల్టుగా నిర్దారించారు. మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణీకుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే సికింద్రాబాద్ - పూణే మధ్య వందేభారత్ స్లీపర్ సైతం అందుబాటులోకి వస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. కొత్త వందేభారత్ అందుబాటులోకి వస్తుండటంతో ప్రయాణీకులకు మరింత వెసులుబాటు కలగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+