షాకింగ్: 'థర్డ్ ఫ్రంట్ సత్తా బాబుకు ఉందనే, ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ రహస్య భేటీ'

హైదరాబాద్: కొడంగల్ ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో రహస్య అజెండాలో భాగంగానే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు థర్డ్ ఫ్రంట్ అంటున్నారని మండిపడ్డారు.

బీజేపీతో ఆన రహస్య ఒప్పందం చేసుకున్నారని, అందుకే మరో ఫ్రంట్ అంటూ హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నాగపూర్ కేంద్రంగా నడిచే ఆరెస్సెస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) చేతిలో కేసీఆర్ కీలుబొమ్మగా మారారని విమర్శించారు.

రహస్య అజెండా ఇలా

రహస్య అజెండా ఇలా

మోడీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు బీజేపీ రహస్య అజెండాలో భాగంగా కేసీఆర్ జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్ అంశాన్ని లేవనెత్తారని రేవంత్ రెడ్డి అన్నారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌కు పడనున్నా, మోడీ వ్యతిరేక ఓట్లు చీల్చాలని కుట్ర పన్నారన్నారు.

 జైట్లీని కలిసిన కేసీఆర్, కేటీఆర్ కోసం కూడా ఒత్తిడి

జైట్లీని కలిసిన కేసీఆర్, కేటీఆర్ కోసం కూడా ఒత్తిడి

ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కేసీఆర్ ఢిల్లీలో కలిశారని, తనపై ఉన్న సీబీఐ కేసును తొలగించాలని కోరారని రేవంత్ ఆరోపించారు. అంతేకాకుండా కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ఒత్తిడి వస్తుందని అందుకే థర్ట్ ఫ్రంట్ అందుకున్నారని చెప్పారు.

ఆ సత్తా చంద్రబాబుకే ఉంది, అందుకే రంగంలోకి కేసీఆర్

ఆ సత్తా చంద్రబాబుకే ఉంది, అందుకే రంగంలోకి కేసీఆర్

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే శక్తి, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పే అనుభవం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే ఉందని రేవంత్ అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకుతున్నట్లు సమాచారం తెలియడంతో ఢిల్లీ పెద్దలు కేసీఆర్‌ను రంగంలోకి దించారన్నారు.

ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ రహస్య మంతనాలు

ఢిల్లీ పెద్దలతో కేసీఆర్ రహస్య మంతనాలు

కేసీఆర్‌ తన ఢిల్లీ పర్యటనలో కేంద్రం పెద్దలతో రహస్య మంతనాలు జరిపినట్లు సమాచారం ఉందని రేవంత్ చెప్పారు. సహారా ఇండియా కంపెనీ కుంభకోణం, ఈఎస్‌ఐ ఆసుపత్రుల కుంభకోణంలో సీబీఐ, ఈడీ కేసులు కొనసాగుతున్నందున వాటి నుంచి బయటపడేందుకు కేసీఆర్ బీజేపీ చెప్పినట్లు డ్రామాలు ఆడుతున్నారన్నారు.

 దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు

దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ను దెబ్బతీసేందుకు థర్డ్ ఫ్రంట్ అంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు, మోడీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకే కేసీఆర్‌ చేత బీజేపీ దీనిని తెరపైకి తెచ్చిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+