సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి, ఇక - ప్రయాణీకులు ఊహించని నిర్ణయం..!!
రైల్వే ప్రయాణీకులకు బిగ్ అప్డేట్. సికింద్రాబాద్ స్టేషన్ లో ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగు తున్నాయి. విమానాశ్రయ తరహాలో సదుపాయాలు కల్పిస్తున్నారు. పూర్తి స్థాయిలో తిరిగి స్టేషన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభంతో ఈ స్టేషన్ పైన ఒత్తిడి తగ్గింది. కాగా.. ఇప్పుడు ప్రయాణీకుల కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఊహించని విధంగా సికింద్రాబాద్ స్టేషన్ లో తెస్తున్న మార్పులు.. తీసుకుంటున్న నిర్ణయాలు ప్రయాణీకులకు ఉపయోగకరంగా మారుతున్నాయి.
అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయాన్ని తలపించే స్థాయిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునీకరిస్తున్నారు. సుమారు రూ.750 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైన పనులు ఇప్పటికే 60శాతానికి పైగా పూర్తయ్యాయి. ఈ క్రమంలో ప్రయాణికుల విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే డిజిటల్ లాంజ్‌లు, కో-వర్కింగ్ స్పేస్‌లను ఏర్పాటు చేసి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, వ్యాపార వేత్తలు, విద్యార్థులకు పని వాతావరణాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రైల్వే ఇప్పటికే ముంబై స్టేషన్‌లో ఈ తరహా సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. డిజటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్‌లో అత్యాధు నిక సదుపాయాలు ఉంటాయి. అదే విధంగా హైస్పీడ్ వైఫై, చార్జింగ్ పాయింట్లు, వీడియో కాన్ఫరెన్సింగ్ సదుపాయాలు, ప్రింటింగ్ /స్కానింగ్ సౌకర్యాలు, ఎయిర్-కండిషన్ వసతి కలిగిన సైలెంట్ వర్క్‌పాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

అదే విధంగా ఆఫీసు తరహాలో టేబుల్, సౌకర్యవంతమైన కుర్చీలు, టీ, కాఫీ సదుపాయాలు, ఆధునిక టాయిలెట్లు, వాష్‌రూములు ఉంటాయి. భోజనం లేదా అల్పాహారం వంటి సౌకర్యాలూ ఉంటాయి. రైలు కోసం వేచి ఉండే సమయంలో, రెండు రైళ్లు మారాల్సి వచ్చినప్పుడు ఉండే విరామం (గ్యాప్)లో ఈ సదుపాయాలను వినియోగించుకుని పని చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్‌ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో అమలు చేసే అవకాశం ఉందని.. ఈ ఏర్పాట్లతో రైల్వేకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ముంబై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన డిజిటల్ లాంజ్.. రోజూ ఉదయం 7 నుంచిరాత్రి 11 గంటల వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. అక్కడ మొదటి గంటకు రూ.200, తర్వాత ప్రతి అదనపు గంటకు రూ.150 చొప్పున చెల్లించి.. డిజిటల్ లాంజ్, కో-వర్కింగ్ స్పేస్ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని వివరించారు. సికింద్రాబాద్ స్టేషన్‌లోనూ ఏర్పాట్లను బట్టి చార్జీలను నిర్ణయించనున్నారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications