సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌.. ఆ ప్లాట్ ఫార్మ్స్ వద్ద కీలక మార్పులు.. రద్దీ దృష్ట్యా..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడం, స్టేషన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం అలాగే మొత్తం కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సమగ్ర చొరవలో భాగంగా పునరాభివృద్ధి పనులు ప్రస్తుతం యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. స్టేషన్ ప్రాంగణంలో భద్రత పాటిస్తూనే.. రైలు ప్రయాణికులకు దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించేలా ఈ పనులు దశలవారీగా పద్ధతి ప్రకారం చేపట్టనున్నారు.

కొనసాగుతున్న పునరాభివృద్ధి కార్యకలాపాలు సజావుగా జరుగడానికి , ప్లాట్‌ఫారమ్ నంబర్ 1 వద్ద పార్కింగ్ సౌకర్యాన్ని తక్షణమే తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే తక్కువ సమయంలో మాత్రమే పికప్ అండ్ డ్రాప్ (వాహన రాకపోకలను) అనుమతిస్తున్నారు. అయితే రైళ్లు ఎక్కడానికి.. దిగడానికి, అలాగే పికప్, డ్రాప్, పార్కింగ్ ప్రయోజనాల కోసం ప్లాట్‌ఫామ్ నంబర్ 10 వైపు తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ప్రయాణీకులకు సమర్థవంతంగా మార్గ నిర్దేశం చేయడంలో భాగంగా ప్రయాణీకుల సౌకర్యం కొరకు స్టేషన్‌ లోని ముఖ్యమైన ప్రదేశాలలో స్పష్టమైన దిశానిర్దేశక సంకేతాలు, పబ్లిక్ అనౌన్స్‌ మెంట్ సిస్టమ్ ద్వారా సందేశాలు, ప్రదర్శన బోర్డులు ఏర్పాటుచేశారు.

ఈ చర్యలు ప్రయాణీకుల భద్రత, భవిష్యత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి అనే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా అమలు చేస్తున్నారు. అసౌకర్యాన్ని తగ్గించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని హామీ ఇస్తున్నారు అధికారులు.

Secunderabad Railway Station Platform 1 Side Parking Temporarily Closed Use Platform 10 Side

మరోవైపు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దక్షిణ మధ్య రైల్వే మరో శుభవార్త తెలిపింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి సంక్రాంతి సందర్భంగా ఏపీకి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 11 స్పెషల్ ట్రైన్స్‌ ను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది. ఆ రైళ్ల వివరాలు చూస్తే.. 1. కాకినాడ టౌన్- వికారాబాద్‌ (07186, 07460), వికారాబాద్‌- కాకినాడ టౌన్ (07185, 07187), వికారాబాద్‌- పార్వతీపురం (07461), పార్వతీపురం- వికారాబాద్‌ (07462), పార్వతీపురం- కాకినాడ టౌన్‌ (07463), సికింద్రాబాద్‌- పార్వతీపురం (07464, 07465).. ఈ స్పెషల్ ట్రైన్స్‌ వివరాలను దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+