ఎర్రబెల్లి, రమణ సెక్యూరిటి కుదింపు: తెలంగాణ టిడిపి ఫైర్
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ సెక్యూరిటీని ప్రభుత్వం కుదించింది. వరంగల్ లోకసభ సీటుకు ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఎర్రబెల్లి, రమణల ఎస్కార్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం కు కుదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రమణ, ఎర్రబెల్లి సెక్యురిటీ కుదింపుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) గల్లీ నాయకులకు కూడా సెక్యురిటీని కల్పిస్తూ టిడిపి నేతల సెక్యూరిటీని తగ్గిస్తున్నారని ఆయన సోమవారంనాడు విమర్శించారు. 20 ఏళ్లుగా ఉన్న సెక్యూరిటిని ఇప్పుడు ఎందుకు తగ్గించారని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నిచారు.
సెక్యురిటీ కుదింపుపై రాష్ట్ర డిజిపి అనురాగ్ శర్మకు లేఖ రాయాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. సాయుధ ఎస్కార్ట్‌ను ఉపసంహరించాలని భద్రతా వ్యవహారాల సమీక్షా కమిటీ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications