రోగి సహాయకురాలిపై సెక్యూరిటీ గార్డు అత్యాచారం

హైదరాబాద్ :ఆసుపత్రిలో రోగి కి సహాయకురాలిగా ఉన్న మహిళపై ఆసుపత్రి సెక్కూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చోటుచేసుకొంది.ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు.

చికిత్స కోసం వచ్చిన వారి సహాయకులపై ఆసుపత్రి సెక్కూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడడం సంచలనం కల్గిస్తోంది. అయితే ఈ ఘటనకు సంబందించి ఎలాంటి పిర్యాదు రాలేదని పోలీసులు చెబుతండగా, డబ్బుల విషయంలో గొడవ కారణంగానే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు.

security guard rape patient attendant in hospital premises

సికింద్రాబాద్ కు చెందిన ఓ వ్యక్తి చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో శనివారం నాడు చేరాడు. ఆయనకు సహాయంగా మహిళ ఆసుపత్రిలో ఉంది. ఆమెకు సెక్యూరిటీ గార్డు మాయమాటలు చెప్పి ఆసుపత్రి బయటకు తీసుకెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డాడని భాదితురాలు చెబుతోంది.

తనపై సెక్యూరిటీ గార్డు అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని భాదితురాలు ఆసుపత్రి ఆవరణలోని పోలీసు అవుట్ పోస్టులో ఫిర్యాదు చేశారని సమాచారం. అయితే ఈ విషయమై తమకు ఎలాంటి సమాచారం రాలేదని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు ఇద్దరి మద్య డబ్బుల విషయంలో గొడవ కారణంగానే తనపై భాదితురాలు తప్పుడు పిర్యాదు చేస్తోందని సెక్యూరిటీ గార్డు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+