మహిళతో స్పీకర్ భద్రతాధికారి రాసలీలలు, నడిరోడ్డుపై నగ్నంగా పరుగెత్తాడు
వరంగల్: తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఓ పోలీసు అధికారి నగ్నంగా రోడ్ల పైన పరుగెత్తినట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... స్పీకర్ మధుసూదనా చారికి సెక్యూరిటీ అధికారిగా పని చేస్తున్న ఓ పోలీసు అధికారి దారి తప్పాడు. వీవీఐపీ కేటగిరిలో ఉన్న మధుసూదనా చారికి భద్రత కల్పించే కీలక బాధ్యతలను పక్కన పెట్టే ఓ మహిళతో రాసలీలల్లో మునిగాడు.
అయితే మహిళ తరఫు బంధువులు దాడికి దిగడంతో అతడు నగ్నంగా నడిరోడ్డుపై పరుగులు పెట్టాడు. పోలీసులు అతడిని రక్షించి, దుస్తులు అందించారు. మంగళవారం రాత్రి సమయంలో ఇది జరిగింది. భూపాలపల్లిలోని రాజీవ్ నగర్ కాలనీ స్పీకర్ క్యాంపు కార్యాలయం సమీపంలో జరిగింది.
స్పీకర్ మధుసూదనా చారికి ప్రభుత్వం వీవీఐపీ కేటగిరి భద్రతను కల్పించింది. ప్రత్యేకించి భూపాలపల్లి పరిసరాల్లో ఇటీవల నిషేధిత మావోయిస్టుల కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయనకు కేటాయించిన సెక్యూరిటీ సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

అయితే వీవీఐపీకి భద్రత కల్పించే గురుతర బాధ్యతను మరిచిన ఓ సెక్యూరిటీ అధికారి.. స్పీకర్ వద్దకు ఏదో పని నిమిత్తం వచ్చిన మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాన్ని అతడు వివాహేతర బంధంగా మార్చుకున్నాడు. ఆ భద్రతాధికారి స్పీకర్‌కు భద్రత కల్పించే విషయాన్ని పక్కనబెట్టి మహిళ ఇంటికి వెళ్లి రాసలీలల్లో మునుగుతాడని అంటున్నారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం మధుసూదనాచారి భూపాలపల్లి వెళ్లగా.. ఆయనకు భద్రతగా అక్కడికి వెళ్లిన సదరు భద్రతాధికారి రాత్రి కాగానే విధులకు డుమ్మా కొట్టి మహిళ వద్దకు వెళ్లాడని తెలుస్తోంది. ఆమెతో రాసలీలల్లో మునిగిపోయాడు.
అప్పటికే ఆ అధికారి వ్యవహారం పైన ఆగ్రహంగా ఉన్న మహిళ తరఫు బంధువులు కాపు కాసి, దాడి చేశారు. దీంతో అతను దుస్తులు లేకుండానే నగ్నంగా రోడ్డుపైకి పరుగెత్తుకొచ్చాడు. ఈ క్రమంలో అక్కడ పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు అతనిని రక్షించారు. పోలీసులు విచారణ జరుపుతున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications